iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత.. టాలీవుడ్ హీరో ప్రియురాలు అరెస్టు

  • Published Jan 29, 2024 | 5:21 PM Updated Updated Jan 29, 2024 | 5:30 PM

Tollywood Hero Lover Got Arrested: టాలీవుడ్ లో మరోసారి మాదకద్రవ్యాలు కలకలం రేపాయి. హైదరాబాద్ లో పోలీసులు సోదాలు నిర్వహించి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Tollywood Hero Lover Got Arrested: టాలీవుడ్ లో మరోసారి మాదకద్రవ్యాలు కలకలం రేపాయి. హైదరాబాద్ లో పోలీసులు సోదాలు నిర్వహించి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

  • Published Jan 29, 2024 | 5:21 PMUpdated Jan 29, 2024 | 5:30 PM
హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత.. టాలీవుడ్ హీరో ప్రియురాలు అరెస్టు

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. హైదరాబాద్ నార్సింగి పోలీసులు ఓ యువతి వద్ద మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్టు కూడా చేశారు. పక్కా సమాచారంతో కోకాపేటలోని ఓ అపార్టుమెంటులో సోదాలు నిర్వహించగా పోలీసులకు మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నిందితుల వద్ద పోలీసులు 4 గ్రాముల MDMA డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అరెస్టైన యువతికి టాలీవుడ్ లో మంచి పరిచాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె ఒక టాలీవుడ్ హీరో ప్రియురాలు అంటూ వార్తలు వస్తున్నాయి. పోలీసులు కూడా నిర్ధారించారు. కానీ, వారి వ్యక్తిగత గోప్యత దృష్ట్యా వివరాలను బహిర్గతం చేయలేదు.

ఈ డ్రగ్స్ ని వీళ్లు వాడేందుకు తెచ్చుకున్నట్లు విచారణలో ఆ యువతి ఒప్పుకుంది. గోవా నుంచి ఈ డ్రగ్స్ ని హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే పోలీసులు ఇప్పుడు మెయిన్ డ్రగ్ పెడలర్ కోసం విచారణ ముమ్మరం చేశారు. వీరి ద్వారా అసలు డీలర్ ని చేరేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ డ్రగ్స్ ని ఎలా తీసుకొచ్చారు? వీరికి ఎవరు సప్లయ్ చేశారు? అసలు మెయిన్ డ్రగ్ డీలర్ ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వార్తతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడింది. ఇప్పటికే పలు సందర్భాల్లో టాలీవుడ్ లో ప్రముఖ హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు మాదకద్రవ్యాలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరోసారి టాలీవుడ్ హీరో ప్రియురాలు అనగానే ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డ్రగ్స్ పదం వినిపిస్తేనే భయంభ్రాంతులకు గురయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తోంది. మరి.. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో ప్రియురాలు అరెస్టు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet