P Krishna
Visakhapatnam Crime News: చిన్న చిన్న గొడవలకే విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారు. విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది
Visakhapatnam Crime News: చిన్న చిన్న గొడవలకే విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారు. విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది
P Krishna
ఇటీవల కాలంలో డబ్బు కోసం కొంతమంది ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాన్ని గడపాలనే దురాశతో ఎదుటి వారిని మోసం చేయడం, ఒక్కోసారి హత్యలకు సైతం తెగబడుతున్నారు. చైన్ స్నాచింగ్, గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం, రక రకాల స్కీములు ఇలా ఎన్నోరకాలుగా ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారు. మరికొంత మంది ఆస్తుల కోసం, వ్యక్తి గత కక్ష్యలతో హత్యలు చేయడం చూస్తున్నాం. క్షణికావేశంలో చేసే దుశ్చర్యలకు ఎన్నో కుటుంబాలు బలి అవుతున్నాయి. అలాంటి ఘటనే ఏపీ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విశాఖ పట్టణంలో గుర్తు తెలియని దుండగుడు అర్థరాత్రి తహసీల్దార్ పై దాడి చేయడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన ను విశాఖ పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాదిలోని ఓ అపార్ట్ మెంట్ లో తహసీల్దార్ నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్‌మెంట్ దగ్గరకు వచ్చాడు. అక్కడే ఉన్న రమణయ్యతో అజ్ఞాత వ్యక్తి వాగ్వాదానికి దిగడంతో ఇరువురి మధ్య కొద్ది సేపు వాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే తనవెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్డుతో రమణయ్యపై దాడి చేశాడు దుండగుడు. దీంతో ఆయన తలపై తీవ్ర గాయం కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడ నుంచి దుండగుడు పరారయ్యాడు.
రమణయ్యను వెంటనే స్థానిక అపోలో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు.. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కాగా, రెండు రోజుల క్రితం వరకు రమణయ్యకు విశాఖ రూరల్ తహసీల్దారుగా పనిచేశారు. ఎమ్మార్వోగా రమణయ్య విధుల్లో చేరి పదేళ్లు అవుతుంది. డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, కలెక్టరేట్ లో ఏవొగా పనిచేశారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా బంటుపల్లికి ట్రాన్స్ వర్ అయ్యారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని సీపీ రవిశంకర్ పరిశీలించారు. ఈ కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు.