iDreamPost
android-app
ios-app

చెల్లెలు తన లవర్‌తో మాట్లాడిందని కోపంతో అన్న ఎంత పనిచేశాంటే..!

  • Published Mar 04, 2024 | 9:13 PM Updated Updated Mar 04, 2024 | 9:13 PM

Uttar Pradesh Crime News: అనుమానం పెను భూతం అయ్యింది.. కోపంతో తీసుకున్న నిర్ణయం ఓ యువతి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Uttar Pradesh Crime News: అనుమానం పెను భూతం అయ్యింది.. కోపంతో తీసుకున్న నిర్ణయం ఓ యువతి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

చెల్లెలు తన లవర్‌తో మాట్లాడిందని కోపంతో అన్న ఎంత పనిచేశాంటే..!

ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం, చంపడం లాంటివి చేస్తున్నారు. ఆ క్షణంలో తెలియక చేసిన తప్పుకు తీరని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.  చాలా వరకు ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా పని ఒత్తిడి,  ఆర్థిక సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల కారణంగానే జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. తన చెల్లలె ఎవరో బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుందన్న కోపంతో సోదరుడు దారుణమైన నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర కలకం రేగింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కస్‌గంజ్ జిల్లా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లా ధోల్నా కొత్వాలి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమ వ్యవహారంలో ఓ సోదరుడు తన అక్కను దారుణంగా కాల్చి చంపాడు. తర్వాత తన మేన మామ సాయంతో గాయపడిన సోదరిని కాల్వలో పడేశాడు. వివరాల్లోకి వెళితే.. ధోల్నా కొత్వాలి కి చెందిన ఓ యువతి ఫోన్ లో మాట్లాడుతుంది. ఆ సమయానికి ఆమె సోదరుడు వచ్చి ఆమెను పలకరించాడు. కానీ ఆమె తన సోదరుడిని పట్టించుకోకుండా ఫోన్ లో మైమరిచి మాట్లాడుతుంది. చాలా సేపటి వరకు ఓపిక పట్టిన ఆమె సోదరుడు కోపోద్రిక్తుడయ్యాడు. సొంత చెల్లి అని చూడకుండా కాల్చాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చెల్లెలు చనిపోలేదని తన మేనమామను పిలిచి అతని సాయంతో హజారా కాల్వలో పడవేశాడు.

ఈ ఘటనలో బాధిత బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయితే ఆమె పోలీసులకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించింది. నోయిడాలోని సెక్టార్ 115 లో నివసిస్తున్న బాధిత బాలికను ఉన్నత పాఠశాల విద్యార్థిని. బాలిక తండ్రి అప్పటికే మృతి చెందాడు. అన్న జిమ్ లో పనిచేస్తున్నాడు. వీరిద్దర్ మేనమావ వద్ద ఉంటున్నారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  నిజా నిజాలు తేలుసుకునేపనిలో పడ్డారు.