P Krishna
చలికాలంలో ఎముకలు కొరికే చలితో ప్రజలు విలవిలాడుతారు. చలి నుంచి రక్షణ పొందేందుక మంటలు వేసుకుంటారు. అయితే కొన్నిసార్లు అది ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది.
చలికాలంలో ఎముకలు కొరికే చలితో ప్రజలు విలవిలాడుతారు. చలి నుంచి రక్షణ పొందేందుక మంటలు వేసుకుంటారు. అయితే కొన్నిసార్లు అది ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది.
P Krishna
దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చలి పంజా విసురుతుంది. ఉదయం పది గంటల వరకు రోడ్లపై మంచు దుప్పటి కప్పినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎముకలు కొరికే చలితో జనాలే అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకోవడంతో వేడి నీళ్లు సైతం గడ్డకట్టే పరిస్థితికి చేరుకుంది. చాలా మంది చలి నుంచి తప్పించుకునేందు నానా తంటాలు పడుతున్నారు. వెచ్చని వస్త్రాలు ధరించడం, కుంపట్లు, హీటర్లు, చలి మంటలు రక రకాలుగా చలి భారి నుంచి రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనర్ధాలు జరిగిపోతున్నాయి.. చలి మంటలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్ లో విషాద ఘటన వెలుగు చూసింది. చలికోసం వేసిన మంటలు ఏడుగురి పిల్లల ప్రాణాలు తీసింది. చలికి తట్టుకోలేక ఒక రూములో కుంపటి పెట్టుకొని నిద్రిస్తున్న చిన్నారులు ఊపిరి ఆడక రెండు వేర్వేరు ఘటనలో చనిపోయారు. దారుణం ఏంటంటే.. అమ్రెహీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. రూమ్ లో బొగ్గు కుంపటి పెట్టుకొని నిద్రపోయి.. ఊపిరి ఆడక చిన్నారులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. గదిలో పూర్తిగా కార్బన్ డైయాక్స్ నిండి.. ప్రాణ వాయువు తగ్గడం కారణం అయి ఉండొచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరోవైపు లఖింపూర్ ఖేర్ జిల్లాలో ఇద్దరు పిల్లలు చలిమంట వేసుకున్న క్రమంలో ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు.
చలి కాచుకోవడానికి వేసిన మంట వద్ద తల్లిదండ్రులతో పడుకున్న అన్నదమ్ములు తెల్లవారే సరికి ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులు ఆపస్మార స్థితిలో పడి ఉండటంతో చికిత్స అందించారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బొగ్గు కుంపటి వెలిగించి గది తలుపులు మూసి వేస్తే.. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వెలువడి ఆక్సీజన్ శాతం తగ్గుతుంది, దీంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోతారు.