iDreamPost
android-app
ios-app

ఫోన్ కోసం గొడవ.. భర్త కండ్లు పొడిచిన భార్య!

  • Published Dec 29, 2023 | 2:25 PM Updated Updated Dec 29, 2023 | 2:25 PM

దేశంలో సెల్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన సెల్ ఫోన్లు మారుమూల గ్రామాల్లో కూడా వాడుతున్నారు.

దేశంలో సెల్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన సెల్ ఫోన్లు మారుమూల గ్రామాల్లో కూడా వాడుతున్నారు.

ఫోన్ కోసం గొడవ.. భర్త కండ్లు పొడిచిన భార్య!

ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒక్క స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉంటుంది అనే స్థాయికి వచ్చాం. సెల్ ఫోన్ తో కమ్యూనికేషన్ మాత్రమే కాదు చాటింగ్, వీడియో, ఫోటోలు ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంటర్ నెట్ తో మనకు ఏది కావాలన్నా క్షణాల్లో చూసుకునే అవకాశం ఉంది. ఒప్పప్పుడు పట్టణాలకే పరిమితం అయిన స్మార్ట్ ఫోన్ గ్రామస్థాయిలో కూడా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. సెల్ ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొంతమంది సెల్ ఫోన్ కోసం ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ భార్య సెల్ ఫోన్ కోసం గొడవ పడి దారుణానికి వడికట్టింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కొంతమంది సెల్ ఫోన్ ని పర్సనల్, ప్రైవసీగా భావించేవారు ఉన్నారు.. తమ ఫోన్ ఎవరైనా తీసుకుంటో పెద్ద గొడవ చేస్తుంటారు. ఒకదశలో కుటుంబంలో ఎవరూ తమ ఫోన్లు చూడటానికి వీలు లేకుండా పాస్ వర్డ్ పెట్టుకునే పరిస్తితి నెలకొంది. భార్య భర్త ఒకరి మొబైల్ ఒకరు చూసే స్వేచ్చలేకుండా పోతుంది. అది కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్ ప్రదేశ్ లోని జరిగింది.. సెల్ ఫోన్ కోసం భర్త తో గొడవపడి అతని కండ్లను పొడింది భార్య. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ లోని బాగ్‌పత్ లో అంకిత్, ప్రియాంక భార్యాభర్తలు. యూట్యూబ్ లో పాటలు చూస్తా సెల్ ఫోన్ ఇవ్వమని ప్రియాంకను అడిగాడు. కానీ తన సెల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించింది ప్రియాంక. అయినా వినకుండా అంకిత్ తన భార్య ఫోన్ కావాలని విసిగించాడు.

Fight for the phone

ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. నీ ఫోన్ లో ఏముంది.. ఎందుకు అంత సీక్రెట్ గా దాస్తున్నావే.. ఇవ్వమంటే ఇవ్వడం లేదని ప్రియంకను గట్టిగా అడిగాడు అంకిత్. దీంతో ఇద్దరి మధ్య గొడవ కొట్టుకునే స్థాయికి వెళ్లింది. విచక్షణ కోల్పోయిన ప్రియాంక పక్కనే ఉన్న కత్తెరతో అంకిత్ కంట్లో పొడిచింది. దీంతో తీవ్ర రక్తస్రావం అయిన అంకిత్ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమై వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉంది.. కంటి చూపు పై ఏ విషయం తెలియాలంటే రిపోర్ట్ రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ కోసం గొడవలు పడేవాళ్లు విచక్షణ కోల్పోయి ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.