P Krishna
ఇటీవల కొంతమంది వివాహబంధానికి తీరని మచ్చ తీసుకువస్తున్నారు. క్షణిక సుఖం కోసం భార్యాభర్తల అనుబంధానికి మచ్చ తెస్తున్నారు. ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు.
ఇటీవల కొంతమంది వివాహబంధానికి తీరని మచ్చ తీసుకువస్తున్నారు. క్షణిక సుఖం కోసం భార్యాభర్తల అనుబంధానికి మచ్చ తెస్తున్నారు. ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు.
P Krishna
వేద మంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండూ నూరేళ్లు కలిసి ఉండాలని దీవిస్తుంటారు. కానీ ఈ మద్య ఒక్క ఏడాది కూడా కలిసి ఉండలేకపోతున్న దంపతులు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఆదిపత్య పోరు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయేందుకు సిద్దమవుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. క్షణిక సుఖం కోసం వివాహబంధానికి తీరని మచ్చ తెస్తున్నారు. ప్రియుడి మోజులో పడిన భార్య కట్టుకున్న భర్తను అతి దారుణంగా చంపిన ఘటన తిరుళ్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
తిరుళ్లూరు జిల్లా పెనాలూరు పేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ (43), కూలీ పనులు చేసకుంటూ జీవిస్తున్నాడు. శ్రీనివాస్ భార్య సరస ఆరేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది. కొంతకాలం తర్వాత అదే గ్రామానికి చెందిన నందిని (38) ని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు కావడం మొదలయ్యాయి. శ్రీనివాస్ కి మద్యం అలవాటు ఉంది.. ఈ క్రమంలోనే దంపతులకు గొడవల జరుగుతూ ఉండేవి. గత 4వ తేదీన పెనాలూరు పేటకు సమీపంలో అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో శ్రీనివాస్ మృతి చెందాడు. భార్య నందిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. మృతదేహాన్ని ఫ్లోరెన్సిక్ పరీక్ష కోసం తిరువళ్లూరు జిల్లా మెడికల్ కాలేజ్ కి పంపించారు.

శ్రీనివాస్ మృతదేహంపై గాయాలు ఉండటంతో డీఎస్పీ కి అనుమానం వచ్చింది. వెంటనే శ్రీనివాస్ భార్య నందని, ఆమె ప్రియుడు కుమారన్ ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించారు. అంతే అసలు నిజం బయట పెట్టారు నందిని.. ఆమె ప్రియుడు కుమారన్. కొంతకాలం క్రితం శ్రీనివాస్ తమ వివాహేతర సంబంధం గురించి తెలిసిందని.. అప్పటి నుంచి తనను శారీరంగా హింసించడంతో కోపంతో హత్య చేసినట్లు నందని తెలిపింది. శ్రీనివాస్ పై దాడి చేసి గొంతు నులిమి హత్య చేసి అటవీ ప్రాంతంలో పడవేసినట్లు నేరం అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పర్చి రిమాండ్ కి పంపించారు.