P Krishna
ఇటీవల రిలేషన్ షిప్ లో ఉన్న ప్రేమికుల మద్య విభేదాలు హత్యలకు దారి తీస్తున్నాయి. సొంతవారిని కాదనుకొని వచ్చి ప్రియుడితో కలిసి ఉన్న పాపానికి అమ్మాయిలు దారణంగా హత్యకు గురవుతున్నారు. ఢిల్లీలో శ్రద్దా వాకర్ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే...
ఇటీవల రిలేషన్ షిప్ లో ఉన్న ప్రేమికుల మద్య విభేదాలు హత్యలకు దారి తీస్తున్నాయి. సొంతవారిని కాదనుకొని వచ్చి ప్రియుడితో కలిసి ఉన్న పాపానికి అమ్మాయిలు దారణంగా హత్యకు గురవుతున్నారు. ఢిల్లీలో శ్రద్దా వాకర్ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే...
P Krishna
ఈ మద్య కాలంలో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది యువత ప్రేమ పేరుతో తెలిసీ తెలియని తప్పులు చేసి వాటిని కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా హత్యలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా రిలేషన్ షిప్ లో ఉన్నావాళ్ల మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగిని శ్రద్దా వాకర్ హత్య గురించి తెలిసిందే. ఆమె ప్రియుడే అతి దారుణంగా హత్య చేసి శరీర భాగాలను ముక్కలు చేసి అడవిలో పడవేశాడు. తర్వాత ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయాయి. ఎంతోమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో బలైపోతున్నారు. ఓ ఐటీ ఉద్యోగిని దారుణంగా హత్యచేశాడు ఆమె ప్రియుడు. ఈ కేసులో సంచలన నిజాలు వెలుగులోయి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో ఐటీ ఉద్యోగిని హత్య కేసులో కనీ వీనీ ఎరుగని నిజాలు వెలుగులోకి వచ్చాయి. నందిని అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయిని ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా హత్యచేశాడు. నందిని హత్య కేసును ఎంతో సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నందిని (25) ని ఆమె ప్రియుడు వెట్రిమారన్ (26) అత్యంత కిరాతకంగా హత్యచేసి చంపాడు. మొదట ఆమెపై బ్లేడు తో దాడి చేసి తర్వాత గొలుసులతో కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడ నుంచి పారిపోయాడు. సగం కాలి ఉన్న శరీరాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టమార్టం పంపించారు.

నందిని, వెట్రిమారన్ మధురైలో కలిసి చదువుకున్నారు.. ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమించుకున్నారు. కానీ కొంతకాలంగా నిందిని.. వెట్రిమారన్ ని దూరంగా పెడుతూ వస్తుంది. దీంతో వెట్రిమారన్ కి నందినిపై అనుమానం కలిగింది.. తనని కాదని వేరు వ్యక్తితో ప్రేమాయణం కొనసాగిస్తుందని భావించాడు. ఈ క్రమంలోనే నందినిని దారుణంగా హత్యచేశాడు. ఈ కేసులో వెట్రిమారన్ ని అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు. ఈ హత్యకేసులో ఓ ట్రాన్స్ జెండర్ పాత్ర ఉన్నట్లు వెలుగు చూసింది. ట్విస్ట్ ఏంటంటే.. ఆ ట్రాన్స్ జెండర్ ఎవరో కాదు.. వెట్రిమారన్ అలియాస్ పాండి మహేశ్వరి. గత ఆరు నెలల క్రితమే అబ్బాయిగా మారడం గమనార్హం. మహేశ్వరి పేరు మార్చి వెట్రిమారన్ అంటూ అబ్బాయిగా చెలామణి అవుతున్నాడు. నందినిని మొదటి నుంచి ఇష్టపడ్డ వెంట్రిమారన్ తనకు దూరమైతుందన్న కోపంతో ఈ హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
A software engineer was chained and burnt alive to death at Thalambur in the city southern suburban on Saturday. The deceased woman was identified as R Nandhini, 25. Police solved the case by arresting a transsexual Vetrimaran.
— A Selvaraj (@Crime_Selvaraj) December 24, 2023