భర్తతో బంగారు భవిష్యత్‌ని ఊహించుకుంది.. అంతలోనే..

Bengaluru Crime News: వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. జీవితంలో అనుకోని సంఘటనలు విషాదాలు మిగుల్చుతాయి.

Bengaluru Crime News: వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. జీవితంలో అనుకోని సంఘటనలు విషాదాలు మిగుల్చుతాయి.

ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా హైవే రోడ్డు పై నడిచే వాహనాలే ఎక్కువ ప్రమాదాలకు గురిఅవుతున్నాయి. ఇందుకు కారణం  నిర్లక్ష్యపు డ్రైవింగ్, అవగాహన లేకుండ క్లీనర్లు డ్రైవింగ్ చేయడం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నామంటున్నారు. పెళ్లై భర్తతో అందమైన జీవితాన్ని ఊహించుకున్న ఆ వివాహత జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

బెంగళూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నేలమంగళ వద్ద యాదేహళ్లి సమీపంలో ద్విచక్ర వాహనంపై భార్యాభర్తలు కలిసి వెళ్తున్నారు.. అటుగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టడంతో చక్రాల కింద పడి గర్బిణి మృతి చెందింది. దీంతో ఆమె కడుపులో ఉన్న 8 నెలల శిశువు కూడా మృతి చెందింది. మృతి చెందిన మహిళ ఈడెహళ్లి గ్రామానికి చెందిన సించన(30) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త మంజునాథ్ గాయపడి ప్రాణాలతో బయడపడ్డారు. విషయం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. జల్లి రాళ్లను తీసుకువెళ్తున్న ట్రక్కు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో పక్కకు తప్పించగా అటుగా అటుగా వస్తున్న దంపతుల ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టగా బైక్ పై నుంచి కింద పడిన సించన ట్రక్కు వెనుక చక్రాల కింద పడి అక్కడిక్కడే మృతి చెందింది. వేగంగా వస్తున్న ట్రక్కు డ్రైవర్ బస్సును తప్పించే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయాడని అనుమానిస్తున్నామని ట్రాఫిక్ పోలీస్ అధికారి చెప్పారు. ఈ ప్రమాదంలో మంజునాథ్ కి గాయాలు కావడంతో వెంటనే నేలమంగళ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్ అరుణ్ కుమార్ (27) ని పోలీసులు అరెస్టు చేశారు. నిండు గర్భిణి అయిన సించన కన్నమూయడంతో ఇరుకుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Show comments