P Krishna
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడుతూ కుటుంబాన్ని దుఖఃసాగరంలో ముంచేస్తున్నారు.
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడుతూ కుటుంబాన్ని దుఖఃసాగరంలో ముంచేస్తున్నారు.
P Krishna
ఇటీవల ఎంతోమంది ప్రతి చిన్న విషయానికి డిప్రేషన్ లోకి వెళ్లి ఎదుటివారిపై దాడులు చేయడం.. లేదా ఆత్మహత్యలకు పాల్పపడటం సర్వసాధారణం అయ్యింది. పెద్దలు, వైద్యులు ఎంతగా కౌన్సిలింగ్ చేసినా మనస్థాపానికి గురైనవారు ఏ సమయంలో ఏం చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఎంతో భవిష్యత్ ఉన్నవాళ్లు చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. పని ఒత్తిడి,అనారోగ్య సమస్యలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ విఫలం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆత్మహత్యలకు చేసుకుంటూ కుటుంబ సభ్యులను విషాదంలో ముంచేస్తున్నారు. తాజాగా డిగ్రీ చదివిన యువతి ఆత్మహత్యకు పాల్పపడింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత్ నగర్ లోని బ్లీస్ శివం అపార్ట్ మెంట్ లో రిటైర్డ్ అధికారి దుర్గాప్రసాద్, లక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కూతురు చందన (23) డిగ్రీ పూర్తి చేసి పీజీ ఎంట్రెన్స్ కోసం ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది. చందన మంగళవారం అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు నుంచి దూకింది.. దాదాపు రెండుమూడు గంటల వరకు కొనఊపిరితో కొట్టుకొని చనిపోయింది. గత కొన్నిరోజులుగా చందన మానసికంగా ఏదో ఇబ్బందులు పడుతున్నట్లుగా కనిపిస్తుందని, అందరితో చాలా సంతోషంగా ఉండే యువతి ఇలా అకస్మాత్తుగా ఎలా ఆత్మహత్య చేసుకుందో అర్ధం కావడం లేదని స్థానికులు అంటున్నారు. అయితే చందన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అన్ని పరిశీలించి కేసు నమోదు చేసకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల దేశ వ్యాప్తంగా ఇలాంటి బలవన్మరణాలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఉన్న విద్యావంతులను చేసి వారికి బంగారు భవిష్యత్ కల్పించాలని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు.. కానీ పిల్లలు మాత్రం ప్రేమలు ఇతర వ్యవహారలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పపడుతూ కన్నవారికి పుట్టెడె దుఖాఃన్ని మిగుల్చుతున్నారు. పోలీసులు, సైకాలజీ డాక్టర్లు కౌన్సిలింగ్ చేస్తూ మానసికంగా కృంగిపోతున్న విద్యార్థులకు సరైన సమయలో కౌన్సిలింగ్ ఇచ్చి వారికి జీవితంపై ఆశ కల్పిస్తున్నారు. చావు ఒక్కటే పరిష్కారం కాదు.. దానికి ఎదిరించి పోరాడితే జీవితంలో మంచి గమ్యాన్ని చేరుకోవచ్చు అని మానసిక నిపుణులు చెబుతున్నారు.