P Krishna
Metpally Crime News: డ్రైవింగ్ చేసే సమయంలో వాహనదారులు ఎంతో జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించి చెబుతుంటారు. జంక్షన్ల వద్ద మైకులు పెట్టి సూచనలు ఇస్తుంటారు. కానీ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు బలితీసుకుంటున్నారు డ్రైవర్లు.
Metpally Crime News: డ్రైవింగ్ చేసే సమయంలో వాహనదారులు ఎంతో జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించి చెబుతుంటారు. జంక్షన్ల వద్ద మైకులు పెట్టి సూచనలు ఇస్తుంటారు. కానీ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు బలితీసుకుంటున్నారు డ్రైవర్లు.
P Krishna
ఈ మధ్య ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నిద్రలేమి, అవగాహన లోపం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఆ విద్యార్థి పెద్దయ్యాక కలెక్టర్ కావాలని కలలు కనేవాడు. అందుకోసం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుతున్నాడు.. మొన్న జరిగిన ఇంటర్ లో మంచి మార్కలు సాధించాడు. కానీ ఏం లాభం.. తండ్రి చేసిన పొరపాటు కొడుకు కలను అంతం చేసింది. ఈ ఘటన జగిత్యాలలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మెట్‌పల్లి లోని చైతన్యనగర్ కి చెందిన మహజన్ శివరామకృష్ణ, శిరీష దంపతుల కుమారుడు మహజన్ అక్షయ్ (18), రిశ్వంత్ సాయి ఇద్దరు కుమారులు. శివరామకృష్ణ పెయింటింగ్ వ్యాపారం చేస్తున్నాడు. పెద్ద కొడుకు అక్షయ్ ఇటీవల ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో 951 మార్కులు సాధించింది.ఈ నేపథ్యంలోనే అక్షయ్ ని అభినందిస్తూ ఆర్యవైశ్య సంఘం ప్రతిభా పురస్కారం అవార్డు అందజేశారు. ఇంజనీరింగ్ చేద్దామని నిర్ణయించుకున్న అక్షయ్ ని తండ్రి శివరామకృష్ణ ఓ కాలేజ్ లో అడ్మీషన్ తీసుకోవడం కోసం బుధవారం కారులో బయలుదేరారు. పని పూర్తి చేసుకొని బుధవారం రాత్రి మెట్‌పల్లి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే దారుణం జరిగిపోయింది. శివ రామకృష్ణ బాగా నిద్ర రావడంతో కొంత సేపు కారును పక్కన పార్కింగ్ చేసి పడుకున్నాడు. కొద్ది సేపు తర్వాత త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో నిద్రమత్తులోనే కారు డ్రైవ్ చేయడం మొదలు పెట్టాడు.
ఇదిలా ఉంటే పక్క సీటు లో కూర్చున్న అక్షయ్ సీటు బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయాడు. శివరామృష్ణ సీటు బెల్టు పెట్టుకున్నాడు. మెట్‌పల్లికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రాజశ్వర్రావు పేట శివారలో నేషనల్ హైవే 63 పై ప్రయాణిస్తున్న సమయంలో కారు ఎదురుగా వస్తున్న లారీ ని ఢీ కొట్టింది. ఎడమవైపు కూర్చున్న అక్షయ్ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అద్దానికి బలంగా తల గుద్దుకోవడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. శివరామకృష్ణ సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అక్షయ్ ని మెట్ పల్లి సివిల్ ఆస్పత్రికి తరలించగా కండీషన్ సీరియస్ గా ఉందని చెప్పారు. వెంటనే నిజామాబాద్ లోని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు అక్షయ్. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు చనిపోయిన విషయం తెలుసుకొని తల్లి శిరీష మృతదేహంపై పడి గుండెలవిసేలా రోధించడం అక్కడ ఉన్నవాళ్ల కళ్లలో నీళ్లు చెమర్చాయి.