Mahbubnagar Crime News: అయ్యో.. ఆ చిన్న కారణంతోనే ఎంత పని చేశావు తల్లీ!

అయ్యో.. ఆ చిన్న కారణంతోనే ఎంత పని చేశావు తల్లీ!

Mahbubnagar Crime News: వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు పిల్లా పాపలతో వర్ధిల్లాలని పెద్దలు దీవిస్తుంటారు. పెళ్లైన రెండేళ్లకు పిల్లలు పుట్టకుంటే ఆ దంపతులు పడే నరకం మాటల్లో చెప్పలేం.

Mahbubnagar Crime News: వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు పిల్లా పాపలతో వర్ధిల్లాలని పెద్దలు దీవిస్తుంటారు. పెళ్లైన రెండేళ్లకు పిల్లలు పుట్టకుంటే ఆ దంపతులు పడే నరకం మాటల్లో చెప్పలేం.

పెళ్లైన కొంత కాలానికి దంపతులకు పిల్లలు పుట్టకపోతే వారు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. ఓ వైపు ఇంట్లో వారు.. మరోవైపు బయట సమాజంలో సూటి పోటి మాటలతో దంపతులు నరకం అనుభవిస్తుంటారు. వివాహం జరిగిన రెండేళ్లలో సంతానం కలగకుంటే వెంటనే ఆస్పత్రులకు పరుగెడుతుంటారు. ఇది సమాజంలో నిత్యం జరిగే తంతే. లోపం ఎవరిదైనా.. ఫలితం మాత్రం మహిళలే అనుభవిస్తున్నారు. కొంతమంది మహిళలు తమకు సంతాన భాగ్యం లేదని కృంగిపోయి మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పపడుతున్నారు. తనకు పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిర్సనగండ్ల లో తీవ్ర విషాదం నెలకొంది. తనకు పిల్లలు పుట్టడం లేదని రాజశ్రీ(29) అనే వివాహిత మనస్థాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పపడింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనకు ఇక పిల్లలు పుట్టరు.. జీవితంపై విరక్తి చెందింది అంటూ భర్తకు ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఇంటికి చేరుకోగా.. అప్పటికే రాజశ్రీ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను నల్లగొండ జిల్లా మాల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశ్రీ తుది శ్వాస విడిచింది. రాజశ్రీని ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంభంపాడు గ్రామానికి చెందిన శేషు కుమార్ కి ఇచ్చి 2014 వివాహం జరిపించారు.

పెళ్లై పదేళ్లు అయినప్పటికీ దంపతులకు సంతాన భాగ్యం కలగకపోవడంతో ఇరుగుపొరుగు వారు సూటి పోటి మాటలు భరించలేకపోయింది రాజశ్రీ. ఇప్పటి వరకు ఎన్నో ఆస్పత్రులు తిరిగారు.. ఎన్నో గుళ్లు తిరిగారు. పిల్లలు పుట్టకపోవడంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. మూడు నెలల క్రితం భర్తతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్లిపోయింది రాజశ్రీ. తనకు సంతానం లేక సమాజంలో తలెత్తుకోలేకపోతున్నానని తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

Show comments