ఇంత దారుణమా.. యువతి ప్రాణం తీసిన కుల అహంకారం!

Khammam Crime News: దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ది సాధిస్తుంది.. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ కులం, మంతం కట్టుబాట్లు, గ్రామ పెద్దల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి.. గ్రామ పెద్దల నిర్ణయంతో ఓ యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది.

Khammam Crime News: దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ది సాధిస్తుంది.. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ కులం, మంతం కట్టుబాట్లు, గ్రామ పెద్దల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి.. గ్రామ పెద్దల నిర్ణయంతో ఓ యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది.

ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడి అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తుంది. చంద్రయాన్-3 లాంటి అద్భుత విజయం అన్ని దేశాలు మనవైపు చూసేలా చేసింది. దేశంలో ఎంత అభివృద్ది చెందినా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కుల, మత విశ్వాసాలు, మూఢ నమ్మకాలతో ప్రజలు జీవిస్తున్నారు.  గ్రామాల్లో కుల పెద్దల అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాము ఏం నిర్ణయిస్తే అదే తుది నిర్ణయం అని.. కట్టుబాటు దాటితే గ్రామ బహిష్కరణ లేదా దారుణమైన శిక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. తన ప్రేమ వ్యవహారంలో కుల పెద్దలు తీసుకున్న నిర్ణయం ఓ యువతి దారుణమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

భద్రాద్రి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కులపెద్దల పంచాయితీ కారణంగా యువతి ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన కట్ల చైతన్య, మానస (24) కొంత కాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. పెద్దలను ఒప్పంచి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.  ఇటీవల వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయారు. ఇదిలా ఉంటే ఇటీవల కట్ల చైతన్యకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. గ్రామ కుల పెద్దలు కొంతమంది మానస కుటుంబ సభ్యులను పిలిపించి చైతన్య వివాహానికి అడ్డు రావొద్దని బెదిరించారు. తమ ప్రేమ వ్యవహారం పదిమందికి తెలియడంతో మానస తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఇంట్లో ఎవరూ లేనిది చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మానస ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మానస కన్నుమూసింది. ఈ క్రమంలోనే కుల పంచాయతీ విషయం బయటకు రావడతంతో మానస తల్లి, తమ్ముడిని పిలిపించి మరోసారి కుల పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తుంది. తమను ఎదిరిస్తే.. ఊరి నుంచి బహిష్కరణకు గురి కావాల్సి వస్తుందని బెదిరింపులకు పాల్పపడినట్లు వార్తలు వస్తున్నాయి.

Show comments