విద్యార్థి ప్రాణాలు తీసిన ఫ్రాంక్ వీడియో..!

Indore Crime News: ఈ మధ్య ఫ్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని ఫ్రాంక్ వీడియోలు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.

Indore Crime News: ఈ మధ్య ఫ్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని ఫ్రాంక్ వీడియోలు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా మంది తమ టాలెంట్ ప్రదర్శిస్తూ వీడియోలు, రీల్స్ చేస్తూ పాపులారిటీ అవుదామని ప్రయత్నిస్తున్నారు. డ్యాన్స్, సాంగ్స్, మీమ్స్ చేస్తూ కొంతమంది పాపులర్ అవుతుంటే.. కొంతమంది మాత్రం ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తూ వీడియోలు తీస్తున్నారు. ఇక ఫ్రాంక్ వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొంతమంది ఫ్రాంక్ వీడియోలు నిజమే అనుకొని కొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ విద్యార్థి ఫ్రాంక్ చేయబోయి ప్రాణామీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఏప్రీల్ ఫూల్స్ డే రోజు అందరూ ఎదుటి వారిని ఫూల్స్ చేయడానికి రక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఎదుటి వాల్లు ఫూల్స్ కాగానే వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు. ఏప్రిల్ ఫూల్స్ డే రోజు స్నేహితుడిని ప్రాంక్ చేస్తుండగా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయాడు ఓ విద్యార్థి. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని మల్హర్ గంజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనే విద్యార్థి సోమవారం ఏప్రిల్ ఫూల్స్ డే రోజు తన ఫ్రెండ్ ని ఫూట్ చేయాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఫ్రెండ్ కాల్ చేసి నా జీవితంపై విరక్తి కలిగింది. నేను ఆత్మహత్య చేసుకుంటున్న అంటూ ఫ్రెండ్స్ కి వీడియో కాల్ చేశాడు. స్టూల్ పై నిల్చొని మెడకు తాడు బిగించుకొని తాను చనిపోతున్నాట్లు ప్రాంక్ చేయబోడు.

అనుకోకుండా స్టూల్ కిందపడిపోయింది.. తాడు అభిషేక్ గొంతుకు బిగుసుకుపోయింది. కళ్ల ముందే తమ ఫ్రెండ్ ఉరితాడుకు వేలాడటం చూసి ఫ్రెండ్ షాక్ తిన్నారు. తాము ఫ్రాంక్ చేస్తున్నామని భావించామని.. కానీ ప్రాణాలు పోయే ప్రమాదం జరుగుతుందని ఊహించలేకపోయాని విలపించారు. ఈ ఘటనపై డిసీపీ రాజేష్ దండోటియా మాట్లాడుతూ.. మృతుడు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ డ్రైవర్ కొడుకు గా గుర్తించామని.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అధినంలోకి తీసుకొని పోస్ట్ మార్టం నిమిత్ం ఆస్పత్రికి తరలించామని అన్నారు. విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Show comments