P Krishna
నేటి సమాజంలో కమ్యూనికేషన్ రంగం ఎంత అభివృద్ది చెందిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీంతో మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంది. ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలు.. ప్రేమగా మారి లివింగ్ రిలేషన్ కి దారి తీస్తుంది.
నేటి సమాజంలో కమ్యూనికేషన్ రంగం ఎంత అభివృద్ది చెందిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీంతో మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంది. ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలు.. ప్రేమగా మారి లివింగ్ రిలేషన్ కి దారి తీస్తుంది.
P Krishna
ఈ మద్య కాలంలో ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మాధ్యమాల ద్వారా పరిచయాలు ఏర్పడి తర్వాత స్నేహితులుగా మారుతున్నారు. ఆ స్నేహం ప్రేమగా మారి లివింగ్ రిలేషన్ దారి తీస్తుంది. ఒకప్పుడు ముఖ పరిచయం లేని వారితో మాట్లాడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవాళ్లు.. కానీ ఇప్పుడు సోషల్ మాధ్యమాల పుణ్యమా అని క్షణాల్లో పరిచయాలు ఏర్పడటం.. ఫోటోలతో, వీడియోలు, తమ అభిరుచులు వ్యక్తిగత విషయాలన్నింటనీ పోస్ట్ చేస్తున్నారు. ఇలా పరిచయం ఏర్పడిన వాళ్లతో కలిసి జీవించేందుకు సిద్దపడే క్రమంలో.. కొందరు వ్యక్తులు ప్రేమ, పెళ్లి అంటూ అడుగులు వేస్తుంటే.. మరి కొందరు తమ స్వార్థంతో దారుణమైన చర్యలకు పాల్పపడుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి ఇండోర్ లో జరిగింది.
గుణ జిల్లాకు చెందిన ప్రవీణ్ సింగ్ ధాకడ్ (24) అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ 20 ఏళ్ల యువతిని అతి దారుణంగా కత్తితో పొడిచి హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటన బుధవారం ఇండోర్‌లో చోటు చేసుకుంది. హత్యకు గురైన యువతి, నిందితుడికి ఈ మధ్యనే పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త లివింగ్ రిలేషన్ గా మారింది. ఈ క్రమంలోనే వాళ్లిద్దరు గత కొద్ది రోజులుగా నగరంలోని రావుజీ బజార్ ప్రాంతంలోని ఒక ఇళ్లును అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంట్లోనే కొన్ని రోజులు సహజీవనం చేస్తూ నివసిస్తున్నారు. అయితే ఉన్నటుండి ఏమి జరిగిందో ఏమో కానీ.. ఆ యువతి డిసెంబరు 7న అద్దె ఇంట్లో దారుణంగా హత్యకు గురైంది. స్థానికకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తెలిపారు.
హత్య విషయంపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినయ్ విశ్వకర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవల హత్యకు గురైన యువతి.. నిందితుడు ప్రవీణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యింది. తర్వాత ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి బాధితురాలు నిరాకరించడంతో కోపోద్రిక్తుడై యువతి మెడపై కత్తితో పొడిచి చంపాడు. యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో నిందితుడు భయాందోళనకు గురై ఇంటి బయట నుంచి తాళం వేసి పారిపోయాడు. అదే సమయంల యువతి మొబైల్ ఫోన్ కూడా తీసుకెళ్లాడంతో.. పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి అరెస్టు చేశాం’ అని అన్నారు. అజ్ఞాత వ్యక్తులతో లివింగ్ రిలేషన్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఢిల్లీలో శ్రద్దా వాకర్ అనే యువతి హత్య.. సహజీవనం ఎంత ప్రమాదమో నిరూపించింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.