Tirupathi Rao
Crime News: రాయదుర్గం కిడ్నాప్ కేసులో పోలీసులు విచారణలో భారీ ట్విస్ట్ వెలుగు చూసింది.
Crime News: రాయదుర్గం కిడ్నాప్ కేసులో పోలీసులు విచారణలో భారీ ట్విస్ట్ వెలుగు చూసింది.
Tirupathi Rao
ప్రస్తుతం ఎక్కడ చూసినా నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పగ, ప్రతీకారం, డబ్బు, అత్యాసలతో అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. మరికొంత మందైతే ఈజీ మనీ కోసం అడ్డ దారులు తొక్కుతున్నారు. అయితే ఎవరో దారినపోయే వాళ్లు డబ్బుకోసం ఇలాంటి దారుణాలకు పాల్పడితే ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోరు. కానీ, డబ్బుకోసం తోడపుట్టిన వాళ్లు, కన్న పిల్లలు కూడా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. అలాంటి ఒక ఘటన ఇప్పుడు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ కేసులో ట్విస్ట్ తెలిసిన తర్వాత పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
రాయదుర్గం కిడ్నాప్ కేసులో పోలీసుల విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సురేందర్ సోదరి సహకారంతోనే కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సురేందర్ సోదరి అతడిని పిలిపించి కిడ్నాపర్లకు అప్పగించింది. అతడిని కిడ్నాప్ తర్వాత నల్లమల అడవులకు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కర్నూలు జిల్లా ఆత్మకూరు ఫారెస్ట్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో కిడ్నాపర్ల చెరలో ఉన్న సురేందర్ ఆచూకీ దొరికింది. కారు, సురేందర్ ని అక్కడే వదిలేసి కిడ్నాపర్లు అక్కడి నుంచి పరారయ్యారు. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. సురేందర్ దొరికిన సంగతి రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సురేందర్ ను క్షేమంగా హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అయితే మిగిలిన ఇద్దరు కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సురేందర్ ను కిడ్నాప్ చేసిన కారణం డబ్బుల కోసమనే చెబుతున్నారు. పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేయడం కోసమే ఈ కిడ్నాప్ కు పాల్పడ్డారు. పోలీసులు ఈ కేసుపై వివరాలు సేకరిస్తున్నారు. సురేందర్ ను ఘటనాస్థలానికి తీసుకెళ్లి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కిడ్నాప్ కేసులో సోదరి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరి.. డబ్బుల కోసం అన్ననే కిడ్నాప్ చేయించిన సోదరిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.