iDreamPost
android-app
ios-app

ఢిల్లీలో దారుణం. పట్టపగలే యువతిపై కత్తితో దాడి!

  • Published Mar 24, 2024 | 6:01 PM Updated Updated Mar 24, 2024 | 6:01 PM

Delhi Crime News: ఈ మధ్య కాలంలో కొంతమంది చిన్న చిన్న విషయాలకు తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Delhi Crime News: ఈ మధ్య కాలంలో కొంతమంది చిన్న చిన్న విషయాలకు తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఢిల్లీలో దారుణం. పట్టపగలే యువతిపై కత్తితో దాడి!

దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారలు, హత్యలు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కొంతమంది కామాంధులు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలకు పాల్పపడున్నారు. ఇటీవల ప్రేమ పేరుతో యువతులను ట్రాప్ లో పడేసి కోరిక తీరిన తర్వాత హత్యలు చేస్తున్నారు. మరికొంతమంది తమను ప్రేమించలేదని కోపంతో దారుణాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురై ఎదుటి వారిపై దాడులు చేయడం, హత్యలకు పాల్పడుతున్నారు.  అలాంటి ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో పట్టపగలు అందరూ చూస్తుండగానే  దారుణ ఘటన వెలుగు చూసింది. పట్టపగలే ఓ యువకుడు.. యువతిని అత్యంత పాశవికంగా తరిమి తమిరి కత్తితో పొడిచి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఢిల్లీ ముఖర్జీ నగర్ లోని నార్త్ క్యాంపస్ వద్ద శుక్రవారం ఓ దారుణ ఘటన సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ కావడంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

అమన్ అనే 22 ఏళ్ల యువకుడు ఓ యువతి దుర్భాషలాడిందనే కోపంతో అక్కడే తోపుడు బండిలో ఉన్న కత్తి తీసుకొని యువతి వెంట పడ్డాడు. యువతి తన ప్రాణాలు రక్షించుకోవడానికి పరిగెత్తింది. తన వద్ద ఉన్న కత్తి తీసుకొని యువతిపై పాశవికంగా దాడికి పాల్పపడ్డాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. కొంతమంది అమన్ ని పట్టుకునే ప్రయత్నం వారికి కత్తి చూపించి బెదిరిస్తూ తప్పించుకున్నాడు. గాయపడిన యువతిని హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.