P Krishna
Delhi Crime News: తమ పిల్లలను కంటికి రెప్పలా సాకుతూ.. వారి బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు తల్లిదండ్రులు. అలాంటిది ఓ తండ్రి చేసిన దారుణం తీవ్ర సంచలనం రేపింది.
Delhi Crime News: తమ పిల్లలను కంటికి రెప్పలా సాకుతూ.. వారి బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు తల్లిదండ్రులు. అలాంటిది ఓ తండ్రి చేసిన దారుణం తీవ్ర సంచలనం రేపింది.
P Krishna
ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురి కావడం.. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎదుటి వాళ్ళపై దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. పని ఒత్తిడి, ప్రేమ వ్యవహారలు, వ్యక్తిగత కక్షలు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయని అంటున్నారు అధికారులు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. కొన్ని గంటల్లోనే పెళ్లి అనగా ఓ తండ్రి కొడుకుని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు బలహీనపడిపోతున్నాయి. ప్రేమ వ్యవహరాలు, ఆస్తులు గొడవలు ఇలా వివిధ కారణాల వల్ల సొంత వారినే హత్య చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి దారుణ ఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో గౌరవ్ సంఘాల (29) అనే యువకుడు కొంతకాలంగా జిమ్ ని నడుపుతున్నాడు. గురువారం అతని పెళ్లి నిశ్చయమైంది. అందరూ పెళ్లి పనుల్లో హడావుడిగా ఉన్నారు. కొద్ది గంటల్లో గౌరవ్ వివాహం జరగాల్సి ఉంది.. అంతలోనే తండ్రి కోడుకుల మధ్య చిన్న వివాదం మొదలైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే కొడుకు గౌరవ్ తనను బంధువుల ముందు దూషించాడన్న కోపంతో తండ్రి రంగలాల్ కత్తితో తన కొడుకును ముఖంపై, ఛాతిపై 15 సార్లు పొడిచి హత్యకు పాల్పపడినట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లి సందర్బంగా సంగీత వాయిద్యాలతో పెద్దగా సౌండ్ రావడంతో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో రంగలాల్ కత్తితో కొడుకును పొడవడం కూడా ఎవరూ గమనించలేదు. ఊరేగింపు కోసం బంధువులంతా వరుడి కోసం వెతుకుతున్న సమయంలో రక్తపు మడుగులో కనిపించాడు గౌరవ్. దాంతో ఒక్కసారిగా షాక్ తిన్న బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న రంగలాల్ పై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టి పట్టుకున్నారు. దర్యాప్తులో తన కొడుకును తానే చంపినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కొన్ని గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డబ్బు మోగడంతో కుటుంబ శోక సంద్రంలో మునిగిపోయింది.