iDreamPost
android-app
ios-app

పరువు హత్య? కులాంతర వివాహం చేసుకున్నారని దారుణంగా..

ప్రేమ వివాహాలు ఈ రోజుల్లో ఎంతో సహజం అయిపోయాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రేమకు విలువనిస్తున్నారు. కానీ, జటం విషయంలో అలా జరగలేదు.

ప్రేమ వివాహాలు ఈ రోజుల్లో ఎంతో సహజం అయిపోయాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రేమకు విలువనిస్తున్నారు. కానీ, జటం విషయంలో అలా జరగలేదు.

పరువు హత్య? కులాంతర వివాహం చేసుకున్నారని దారుణంగా..

ప్రస్తుతం సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వ సాధారణం అయిపోయాయి. అందరూ చదువుకుంటున్నారు.. కులం, మతం, వర్గం, వర్ణం, ప్రాంతం అనే బేధాలను మర్చిపోతున్నారు. వారి మనసుకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటున్నారు. పిల్లల నిర్ణయాలను తల్లిదండ్రులు కూడా అంగీకరిస్తున్నారు. విదేశీయులతో సైతం అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. కానీ, ఇంకా ఈ సమాజంలో కొందరు దుర్మార్గపు ధోరణి, వైఖరితోనే కొట్టుమిట్టాడుతున్నారు. వారికి కన్న పిల్లల కంటే కూడా.. కంటికి కనిపించని పరువు, మర్యాదలే ఎక్కువయ్యాయి. ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతున్నాయంటే మనుషుల ఆలోచన ఎంత వెనుకబడి పోయిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తమిళనాడులో ఒక పరువు హత్య కేసు వెలుగు చూసింది. కన్న కూతుర్ని దారుణంగా హత్య చేశారు.

ఈ దారుణం తమిళనాడులోని తంజావూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తంజావూరు జిల్లా పూవలూరు నివాసులైన నవీన్(19), ఐశ్వర్య(19) వేర్వేరు కులాలకు చెందినవాళ్లు. స్కూల్లో చదువుకునే రోజుల నుంచే వీరి మధ్య పరిచయం ఉంది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పనికోసం మూడేళ్ల క్రితం నవీన్ తిరుపూర్ వెళ్లాడు. అక్కడే ఒక బనియన్ కంపెనీలో పనికి చేరాడు. గతేడాది ఐశ్వర్యను కూడా తిరుపూర్ కి పిలిపించి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి చేర్పిచారు. వీళ్లిద్దరు 18 నెలలు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. చివరకు వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే తల్లిదండ్రులకు విషయం చెప్పేదుకు ఐశ్వర్య భయపడింది.

నవీన్ తో వివాహం వాళ్లు అంగీకరించరని ముందే గ్రహించింది. అందుకే ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని వీళ్లిద్దరు 2023, డిసెంబర్ 31 రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య పేరెంట్స్ ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్- ఐశ్వర్యలను గుర్తించిన పోలీసులు ఐశ్వర్యను జనవరి 2న తల్లిదండ్రులకు అప్పజెప్పారు. అయితే జనవరి 3న ఐశ్వర్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబం తెలిపింది. అంతేకాకుండా ఈ సమాచారం కనీసం నవీన్ కు చేరవేయకుండా ఐశ్వర్యకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకునన నవీన్.. ఐశ్వర్యను ఆమె కుంటంబమే హత్య చేసిందని పోలీసులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐశ్వర్య కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.

దీనిని పరువు హత్యగానే పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. కేసులో దర్యాప్తు  ప్రారంభించారు. ఈ కేసు ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది. ఈ వివరాలు తెలుసుకున్న నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తక్కువ కులం వ్యక్తిని వివాహం చేసుకుందని కన్న బిడ్డను చంపుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్షలు విధించినా కూడా తక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లు గనుక దోషులుగా తేలితే కఠినమైన శిక్షలు విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.