iDreamPost
android-app
ios-app

భార్య అలా ప్రవర్తించదని భర్త దారుణం! హత్య చేసి..అనంతరం..

నేటికాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య సహనం, సర్ధుకునే గుణం అనేది లేకుండా పోయింది. దీంతో హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ భర్త కట్టుకున్న భార్యను కాటేశాడు.

నేటికాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య సహనం, సర్ధుకునే గుణం అనేది లేకుండా పోయింది. దీంతో హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ భర్త కట్టుకున్న భార్యను కాటేశాడు.

భార్య అలా ప్రవర్తించదని భర్త దారుణం! హత్య చేసి..అనంతరం..

జీవితంలో సంసారం అనేది ఓ ప్రత్యేకమైన జర్నీ. ఎటువంటి సంబంధం లేని ఇద్దరు మనుషుల్లో పెళ్లి అనే బంధంతో ఒకటై..కొత్త ప్రయాణం ప్రారంభిస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే సమస్యలను ఒకరికొకరు తోడుగా ఉంటూ ధైర్యంగా ఎదుర్కొంటారు. అంతేకాక చిన్న చిన్న గొడవలు జరిగినా కాసేపటికి ఒకటవుతారు. అలా పూర్వం కాలంలో దంపతలు ఎంతో సంతోషంగా జీవించారు. అయితే నేటికాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య సహనం, సర్ధుకునే గుణం అనేది లేకుండా పోయింది. దీంతో హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ భర్త కట్టుకున్న భార్యను కాటేశాడు. అసలు ఎందుకు హత్య చేశాడో తెలిస్తే.. ఆశ్చర్య పడకమానరు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ నియోజవర్గంలో న్యూభరత్ నగర్ కాలనీలో ప్రదీప్ బోలా, మధుస్మిత(28) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరు ఒడిశా రాష్ట్రంలోని అయబ, కెండ్రపరకు ప్రాంతానికి చెందిన వారు. ప్రదీప్.. అయబ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తికాగా..మధు స్మిత కెండ్రపరకు అనే గ్రామానికి చెందినది. వీరిద్దరికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. జీవనోపాధి కోసం కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చి..ఉప్పల్ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. చాలా కాలం పాటు వీరి సంసారం చాలా సంతోషంగా సాగింది. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ..కొన్నాళ్లుగా ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

తరచూ ప్రదీప్, స్మిత ఘర్షణ పడుతుండే వారు.  ఈ క్రమంలోనే ఇటీవలే మరోసారి ఈ దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. తనకు ఎదురుతిరిగిందని, తనపైనే గొడవపడుతుందనే కోపంతో ప్రదీప్ దారుణానికి ఒడిగట్టాడు. క్షణికావేశంతో ప్రదీప్ తన భార్య మధు స్మితను హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని సంచిలో పెట్టి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు 100కి కాల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ దంపతులు నివాసం ఉండే ఇంటికి చేరుకున్నారు. గది తలుపులు తెరచి చూడగా..కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.

ఇక ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు ఎక్కువయ్యాయి. కేవలం వాగ్వాదాల వరకే పరిమితం అయితే పర్లేదు. కానీ కొందరు మాత్రం పరిధి దాటి..పగలు ప్రతికారాల వరకు వెళ్తున్నారు. అంతేకాక పంతాలకు పోయి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాలు, ఆర్ధిక సమస్యలు ఇతర కారణాలతో భార్యాభర్తలు ఘర్షణ పడి..చివరకు ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం జరిగాయి. మరి.. ఇలాంటి హత్యలు, ఆత్మహత్యల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.