iDreamPost
android-app
ios-app

వీడియో: యువకుడి దారుణ హత్య.. కసితీరా 40 సార్లు కాల్చి..!

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ యువకుడ్ని అత్యంత దారుణంగా దాదాపు 40 సార్లుకాల్చి  చంపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ యువకుడ్ని అత్యంత దారుణంగా దాదాపు 40 సార్లుకాల్చి  చంపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వీడియో: యువకుడి దారుణ హత్య.. కసితీరా 40 సార్లు కాల్చి..!

నేటికాలంలో మనుషుల్లో పగలు, ప్రతీకారాలు ఎక్కువయ్యాయి. ప్రతి చిన్న గొడవకు ఎదుటి వ్యక్తిపై కోపం పెంచుకుంటున్నారు. ఇంకొందరు అయితే ఏకంగా చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి తరుణంలోనే కొన్ని దారుణమైన హత్య ఘటనలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ యువకుడ్ని అత్యంత దారుణంగా దాదాపు 40 సార్లుకాల్చి  చంపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అప్పటి వరకు కస్టమర్ల మాదిరిగా కూర్చున్న హంతకులు..సడెన్ గా గన్లతో విరుచుక పడ్డారు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే..

దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని రాజౌరి గార్డెన్‌లోని బర్గర్ కింగ్ స్టోర్‌‌కి అమన్ జూన్ (26) అనే యువకుడు ఓ యువతితో వచ్చాడు. ఇక ఆ ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. చాలా సేపు వారిద్దరు ముచ్చటించుకున్నారు. ఇదే సమయంలో అమన్ జూన్ కి ఆ యువతి తన ఫోన్ లో నుంచి ఓ వ్యక్తి ఫోటోను చూపిస్తోంది.  ఇదే సమయంలో వారి పక్కన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కూర్చున్నారు. ఆ యువతి యువకుడు మాటల్లో ఉండగా.. వారి పక్కనే కూర్చున్న ఆ వ్యక్తులు.. ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో షాక్ గురైన అమన్ బిల్ కౌంటర్ వైపు పరుగులు తీశాడు. అయిన అతడిని వదలని ఆ హంతుకులు వెంటాడి మరీ కాల్చారు.

పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో నిలబడి మరీ కాల్పులు జరిపారు. ఒళ్లుగగ్గుర్పాటుకు గురి చేసే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకుడి పక్కనే కూర్చున్న యువతి.. కాల్పుల శబ్దంతో బయటకు పారిపోయింది. దాదాపు 38 నుంచి 40 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకుల వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని ఘటనా స్థలిలో ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. 2020లో హర్యానాలో జరిగిన ఓ హత్యకు ఇది ప్రతీకారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువతి హనీ ట్రాప్ ద్వారా ఆ యువకుడిని బగ్గర్ కింగ్ కి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అమన్ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అమాన్ తో పాటు వచ్చిన యువతికి నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. అమన్ ఫోన్ తో  పాటు అతడి వ్యాలెట్‌ను తీసుకుని  ఆ యువతి పరారైంది. ప్రస్తుతం పోర్చుగీసులో ఉన్న గ్యాంగ్‌స్టర్ హిమాన్షు తానే ఈ హత్య చేయించినట్టు ప్రకటించాడు. తన సోదరుడు శక్తి దాదాను అమన్ చంపేశాడని, అందుకు ప్రతీకారంగా ఈ హత్య చేయించానని పేర్కొన్నాడు. తన సోదరుడి హత్య కారణమైన ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించాడు. ఢిల్లీ, హర్యానలో హిమాన్షు గ్యాంగ్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.