iDreamPost
android-app
ios-app

AP: భర్త స్నేహితుడిపై కన్నేసి.. ఖిలాడీ భార్య దారుణం!

  • Published Feb 16, 2024 | 2:00 PM Updated Updated Feb 16, 2024 | 5:24 PM

వివాహేతర సంబంధాల మోజులో జరిగే హత్యలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా మరోసారి ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్త పై అత్యంత దారుణానికి ఒడిగట్టింది.

వివాహేతర సంబంధాల మోజులో జరిగే హత్యలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా మరోసారి ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్త పై అత్యంత దారుణానికి ఒడిగట్టింది.

  • Published Feb 16, 2024 | 2:00 PMUpdated Feb 16, 2024 | 5:24 PM
AP: భర్త స్నేహితుడిపై కన్నేసి.. ఖిలాడీ భార్య దారుణం!

దేశంలో వివాహేతర సంబంధాల మోజులో జరిగిన హత్యలకు హద్దులు లేకుండా పోతుంది. తరుచు ఏదో ఒక చోట ఈ దారి తప్పిన బంధాలకు బానిసలై కుటుంబన్నే మార్చిపోతున్నారు. లేనిపోని సుఖ సంతోషాలకు ఆకర్షితులై పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లేనిపోని దారుణలకు ఒడిగట్టి, కుటుంబాలనే చిన్నభిన్నం చేసుకుంటూ.. జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు.  తాజాగా మరోసారి ఓ మహిళ వివాహేతర సంబంధం మోజులో పడి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ హత్యకు సంబంధించి స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం ఆ మృతదేహన్ని స్థానికంగా ఉండే పెట్రోల్ బంక్ లో తగలబెట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం సున్నపుగుట్ట తండాకు చెందిన ఖాదర్ బాషా ఐచర్ వాహన డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య గులాబ్ జాన్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా, ఖాదర్ భాషాకు కదిరి పట్టణం నిజాంవలి కాలనీకి చెందిన బాబ్జాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పాడింది. దీంతో బాబ్జాన్ తరచూ ఖాదర్ వాళ్ల ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఖాదర్ బాషా భార్య గులాబ్ జాన్, కు బాబ్జాన్‎ల మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అలా వీరిద్దరి అక్రమ సంబంధం కొనసాగించడంతో.. నిజం తెలుసుకున్న ఖాదర్ బాషా భార్యను మందలించాడు. కానీ, ఆమెలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. పైగా తరుచు ఖాదర్ బాషా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఎలాగైనా భర్త ఖాదర్ బాషాను అడ్డు తొలగించుకోవాలని గులాబ్ జాన్, ఆమె ప్రియుడు బాబ్జాన్ నిర్ణయించుకున్నారు.

ఇక పథకం ప్రకారం గత నెల 31న మద్యం మత్తులో ఉన్న ఖాదర్ బాషాను హత్యచేశారు. ఇక ఈ మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి ద్విచక్ర వాహనంపై కదిరి మండలం కారెడ్డిపల్లి సమీపంలోని వాగు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారి వెంట తెచ్చుకున్న పెట్రోలును ఖాదర్ బాషా పై పోసి తగలబెట్టారు. అయితే మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో.. సగం కాలిన శవాన్ని ప్లాస్టిక్ సంచిలో వేసుకుని దగ్గరలోని చెరువులో పడేసి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఏమి ఎరగనట్టు తన భర్త ఖాదర్ బాషా డ్రైవింగ్‎కు వెళ్లి తిరిగి రాలేదంటూ భార్య గులాబ్ జాన్ కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. టెక్నాలజీ ఆధారంగా ఖాదర్ బాషా ఫోన్ లొకేషన్ ద్వారా కేసును ఛేదించారు. ఈ క్రమంలోనే మృతుడి సెల్ ఫోన్ సున్నపుగుట్టతండా పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సెల్ ఫోన్ లొకేషన్‎లో జాడ లేకపోవడంతో.. పోలీసులకు మృతుడి భార్యపై అనుమానం కలిగింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగు వచ్చింది. ఇక మృతుడి భార్య గులాబ్ జాన్‎తో పాటు ఆమె ప్రియుడు బాబ్జాన్‎ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే చెరువులో పారేసిన ఖాదర్ బాషా మృతదేహాన్ని పోలీసులు రికవరీ చేయడంతో ఈ కేసు మిస్టరీ వీడింది. మరి, ప్రియుడి మోజులో భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఆ మహిళ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.