Arjun Suravaram
యువకుల మధ్య జరిగే కొన్ని ఘటనలు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ర్యాగింగ్, డబ్బులు, అమ్మాయిలకు సంబంధించిన విషయాల్లో యువకులు మధ్య గొడవలు జరుగుతుంటాయి. తాజాగా ఓ విద్యార్థిపై ఆరుగురు తోటి విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు.
యువకుల మధ్య జరిగే కొన్ని ఘటనలు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ర్యాగింగ్, డబ్బులు, అమ్మాయిలకు సంబంధించిన విషయాల్లో యువకులు మధ్య గొడవలు జరుగుతుంటాయి. తాజాగా ఓ విద్యార్థిపై ఆరుగురు తోటి విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు.
Arjun Suravaram
విద్యార్థుల మధ్య చిన్నచిన్న గొడవలు అనేవి సహజం. అయితే కొన్ని సందర్భాల్లో అమ్మాయిల విషయంలో, డబ్బుల విషయంలో పెద్ద ఘర్షణలే చోటుచేసుకుంటాయి. అలానే కొందరు అయితే ఏకంగా కిడ్నాప్ చేసి.. చిత్ర హింసలకు గురి చేస్తుంటారు. గతంలో ఓ విద్యార్థిని బట్టలు విప్పి..సిగరెట్ తో కాల్చిన ఘటనలు మనం చూశాం. అలానే మరికొన్ని ఘటనలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ పేరుతో చిత్ర హింసలకు గురి చేస్తే..బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ లో రెండు రోజుల క్రితం ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. భర్తను తాళ్లతో కట్టేసి.. సిగరెట్ తాగుతూ భార్య టార్చర్ పెట్టిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోరమైన ఘటన మరువక ముందే మరో ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్క కొడుతుంది. యూపీలోని కాన్పూర్‌లో ఆర్ఎస్ గౌతమ్ అనే విద్యార్థి నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆ యువకుడిని తోటి విద్యార్థులు కిడ్నాప్ చేసి.. అనంతరం దారుణంగా హింసించారు. ఓ గదిలో ఆ యువకుడి ఒక్కడిని చేసి.. తీవ్రంగా టార్చర్ పెట్టారు. అతడి శరీరంపై మంటలతో కాల్చి, అలానే తన వెంట్రుకలను కాల్చే ప్రయత్నం చేశారు. అంతేకాక ప్రైవేట్ భాగానికి ఇటుకతో కట్టేసి ఘోరంగా హింసించారు. మొత్తం ఆరుగురు విద్యార్థులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధితుడు ఆర్ఎస్ గౌతమ్ ఇంటర్ పూర్తి చేశాడు. అతను మండిలోని కాకడియో కోచింగ్ తీసుకుంటూ నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. నిందితులు కూడా నీట్ ఎగ్జామ్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక బాధితుడు ఎంత వేడుకున్న కూడా నిందితులు కనికరం చూపకుండా మరింత టార్చర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియనప్పటికి.. ఓ టాక్ మాత్రం వినిపిస్తోంది. ఆ యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లో ఓడిపోయాడు. ఈ క్రమంలో వారికి రూ.20 వేలు చెల్లించాల్సి ఉండగా అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ఆ ఆరుగురు యువకులు దాడి చేసినట్లు తెలిసింది. బాధితుడు ఇటావా జిల్లాలోని లావేడి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో నివసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
#UttarPradesh: Students preparing for #NEET in #Kanpur brutally beat up their classmate. He was hung by tying a rope around his private part. They tried to burn his hair with fire spray.
Actually, the victim student lost 20K in an online game. pic.twitter.com/TO1MhtAt0y
— Siraj Noorani (@sirajnoorani) May 7, 2024