ఆ ఒక్క కారణంతో విద్యార్థిని ఎంతపని చేసిందంటే?

Chhattisgarh Crime News: ఇటీవల చాలా మంది ప్రతి విషయానికి చిరాకు పడటం, మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో దారుణ నిర్ణయం తీసుకుంటున్నారు.

Chhattisgarh Crime News: ఇటీవల చాలా మంది ప్రతి విషయానికి చిరాకు పడటం, మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో దారుణ నిర్ణయం తీసుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో క్షణికావేశంలో ఎదుటి వారిపై దాడులు చేయడం.. తమను తాము అంతం చేసుకోవడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు.మరోవైపు తాము ఎంతో కష్టపడి చదివినా అనుకున్న మార్కులు సాధించలేకపోయామని బాధతో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పపడింది. ఈ ఘటన చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. ఎందుకు ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందీ? పూర్తి వివరాల్లోకి వెళితే..

చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పపడటం తీవ్ర కలకం రేపింది. 12 వ తరగతి పరీక్షలో మృతురాలు 63 శాతం మార్కులు సాధించింది. మొదటి నుంచి చదువుల్లో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ వచ్చిన ఆ విద్యార్థిని తనకు వచ్చిన మార్కులు సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసుంధర బార్లే (17) తండ్రి కేవల్ దాస్ బార్లే కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. కేవల్ దాస్ కుటుంబలో అందరూ మంచి చదువులు చదువుకున్న వారే. అందుకే వసుంధరకు అందరూ గైడెన్స్ ఇస్తూ ఉండేవారు.

వసుంధర బార్లే చిన్నప్పటి నుంచి మంచి ర్యాంకులు సాధిస్తూ చదువుల్లో నెంబర్ వన్ గా ఉంటూ వచ్చింది.  వసుంధర ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది. ఇటీవల ఫలితాలు రిలీజ్ అయిన మార్కులు చూసి ఆమె ఎంతో బాధపడింది. వసుంధరకు సెకండ్ ఇయర్ లో 63 శాతం మార్కులు వచ్చాయి. దీంతో తనకు 90 శాతం మార్కులు వస్తాయని భావిస్తే.. 60 శాతం రావడం జీర్ణించుకోలేకపోయింది. రిజల్ట్ వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పపడి ఉండవొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మార్కులు ప్రాధాన్యత కాదు.. మంచి చదువు ఉంటే ఉన్నతమైన శిఖరాలు అధిరోహిస్తారు అని ఎంతో మంది రుజువు చేశారు. కానీ విద్యార్థులు మార్కుల మాయలో పడి తమ తనువు చాలిస్తున్నారు. వసుంధర మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Show comments