iDreamPost
android-app
ios-app

చంపాపేట యువతి స్వప్న హత్య కేసులో ట్విస్ట్.. హంతకుడు ఎవరంటే?

  • Published Oct 29, 2023 | 4:36 PM Updated Updated Oct 29, 2023 | 4:36 PM

ఈ మద్య కాలంంలో వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి. క్షణిక సుఖం కోసం బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు.

ఈ మద్య కాలంంలో వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి. క్షణిక సుఖం కోసం బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు.

చంపాపేట యువతి స్వప్న హత్య కేసులో ట్విస్ట్.. హంతకుడు ఎవరంటే?

ఈ మద్య కాలంలో చాలా మంది క్షణికావేశంలో ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. పని ఒత్తిడి, వివాహేతర సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు ఎలా ఎన్నో కారణాల వల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడటం.. లేదా ఎదుటి వారిని దారుణంగా హత్య చేయడం లాంటివి చేస్తున్నారు. ఇటీవల చాలా వరకు అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్యలు జరుగుతున్నాయి. శనివారం చంపాపేట లో యువతి హత్య‌ తీవ్ర కలకలం సృష్టించింది.. ఈ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్.. చంపాపేట్ లో నిన్న రాత్రి ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కాలనీలో స్వప్న(21) ఏళ్ల యువతి హత్యకు గురైంది. అదే సమయంలో ఓ వ్యక్తి రెండో అంతస్తుపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ రెండు ఘటనలు ఒకేసారి జరగడంతో కాలనీ వాసులు ఒక్కసారే షాక్ తిన్నారు. అసలు ఏం జరిగింది..? స్వప్నను హత్య చేసింది ఎవరు? బిల్డింగ్ పై నుంచి పడింది ఎవరు? పోలీసులు కేసు నమోదు చేసుకొని లోతుగా దర్యాప్తు చేశారు.. కేసు మిస్టరీని ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శనివారం హత్యకు గురైన యువతి పేరు స్వప్న.. గాయపడ్డ వ్యక్తి ఆమె భర్త ప్రేమ్. కొంత కాలంగా స్వప్న.. సతీష్ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.  శనివారం రాత్రి ప్రేమ్ ఇంటికి వచ్చేసరికి స్వప్న తన ప్రియుడితో రెడ్ హ్యాండ్ గా దొరికిపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో కత్తితో ప్రేమ్.. స్వప్నపై దాడి చేసి హత్య చేశాడు.  అనంతరం ప్రేమ్ పై సతీష్ దాడి చేసి బిల్డింగ్ పై నుంచి తోసేసి అక్కడ నుంచి పారిపోయాడు. కింద పడ్డ ప్రేమ్ కోమా లోకి వెళ్లిపోయాడు. కోమా నుంచి బయటికి వచ్చిన ప్రేమ జరిగిన విషయం పోలీసులకు తెలిపాడు. స్వప్న తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.