iDreamPost
android-app
ios-app

దైవ దర్శనానికి వెళ్తూ.. అనంత లోకానికి! 8 మంది దుర్మరణం

  • Published Dec 01, 2023 | 1:58 PM Updated Updated Dec 01, 2023 | 1:58 PM

దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పలితం మాత్రం శూన్యం.

దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పలితం మాత్రం శూన్యం.

దైవ దర్శనానికి వెళ్తూ.. అనంత లోకానికి! 8 మంది దుర్మరణం

ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక దశలో ఇంటినుంచి బయటికి వచ్చిన వాళ్లు తిరిగి ఇంటికి వెళ్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు.. పలువురు దుర్మరణం అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయి. నిద్రలేమి, అతి వేగం, అనుభవ రాహిత్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా డ్రైవర్ల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా దైవ దర్శనం కోసం ఆలయానికి వెళ్తున్న ఓ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏనిమిది మంది చనిపోయారు. వివరాల్లోకి వెళితే..

ఒడిశాలో రాష్ట్రం కేంఘహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున బాలిజోడి వద్ద జాతీయ రహదారిపై ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ జీప్ ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి జీపు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించి.. మృతదేహాలను పోస్ట్ మార్టానికి పంపించారు. ఇక తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

కేంఝహార్ జిల్లా ఘటగావ్ లో ఉన్న మతా తారిణి ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో జీపులోమొత్తం 20 మంది ఉన్నారని.. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారంతా గంజాం జిల్లా పొడమరి గ్రామ వాసులు అని వెల్లడించారు. బాధితుల్లో కొంతమంది మాజీ రాజ్యసభ సభ్యుడు రేణు బాల ప్రధాన్ బంధువులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక భారత దేశంలో ఉన్న శక్తి పీఠాల్లో ఒకటి తారణి దేవాలయం.. ఇక్కడ భక్తులు పార్వతీ దేవిని పూజిస్తుంటారు. దైవ దర్శనం కోసం వెళ్లి అనంత లోకాలకు వెళ్లిన తమ వారి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనకు అతి వేగమే ముఖ్యకారణం అని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.