కానిస్టేబుళ్లతో గొడవ.. మనస్థాపంతో SI ఆత్మహత్యాయత్నం..!

Aswaraopet News: గత కొన్నిరోజులుగా తన కింది స్థాయి సిబ్బంది చేస్తున్నఅవినీతి ఆరోపణలు, గొడవలు, తీవ్ర ఒత్తిడి తట్టుకోలేక ఓ ఎస్సై దారుణమైన నిర్ణయం తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

Aswaraopet News: గత కొన్నిరోజులుగా తన కింది స్థాయి సిబ్బంది చేస్తున్నఅవినీతి ఆరోపణలు, గొడవలు, తీవ్ర ఒత్తిడి తట్టుకోలేక ఓ ఎస్సై దారుణమైన నిర్ణయం తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్రమైన మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో ఎదుటి వారిపై దాడులు చేయడం లేదా ఆత్మహత్యలకు పాల్పపడటం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు, సహ ఉద్యోగుల వేధింపులు, పని ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాలు వల్ల ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. తన కింది స్థాయి సిబ్బంది తనపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో తట్టుకోలేక ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, సహ సిబ్బంది‌తో గొడవలు, వేధింపులు తట్టుకోలేక అశ్వరావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం రేపింది. గత కొంత కాలంగా ఆయన తీవ్ర ఆందోళతో ఉంటున్నారని.. ఈ క్రమంలోనే పురుగుల మందు తాగి చనిపోవటానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. 108 కి సమాచారం అందడంతో అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎస్సై శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది.  వరంగల్ జిల్లా నారక్కపేటకు చెందిన శ్రీరాములు శ్రీనివాస్ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం (జూన్ 30) ఆయన కొత్త చట్టాలపై స్టేషన్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత స్టేషన్ నుంచి వెళ్లిపోయిన ఆయనకు సిబ్బంది ఫోన్ చేయగా రెండు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది కంగారుపడి సీఐ జితేందర్ రెడ్డికి సమాచారం అందించారు.

ఎస్సై కనిపించకుండా పోయినట్లు తెలుసుకున్న సీఐ ప్రత్యేక బృందాలు బరిలోకి దింపారు. ఆయన తన కారులో మహబూబాబాద్ జిల్లా కేంద్రం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గమనించారు. ఆదివారం ఉదయం ఎస్సై తన ఫోన్ ఆన్ చేసి తాను పురుగుల మందు తాగినట్లు 108 కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది వెంటనే ఆయను వరంగల్ ఎంజీఎం కి తీరలించి తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి పింపించారు.  ఇదిలా ఉంటే.. ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి  కారణం కొంతకాలంగా ఆయనపై వరుసగా అవినీతి ఆరోపణలు రావడం.. కానిస్టేబుళ్లతో గొడవలు,  పై అధికారులు మందలించడం జరుగుతున్నట్లు సమాచారం. గత నాలుగు నెలల్లోనే నాలుగు మెమోలు జారీ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

Show comments