P Venkatesh
P Venkatesh
ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఊహించలేము. అనుకోకుండా జరిగే ప్రమాదాలు తీరని విశాదాన్ని మిగుల్చుతాయి. ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు తీవ్ర వేధనకు గురవుతారు. అప్పటి వరకు తమతో గడిపిన వారు అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రికి తరలించే లోగానే తుది శ్వాస విడిచింది. కాసేపట్లో పాఠశాలకు చేరుకుంటదనంగా ఈ ఘోరం జరిగింది. ఈ విషాద ఘటన తెలంగాణ లోని అసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మంజుల అనే టీచర్ రోజు మాదిరిగానే విధులకు హాజరయ్యేందుకు సిద్ధమైంది. తన స్కూటీ పై బయలు దేరిన మంజుల మరో టీచర్ నిర్మలను ఎక్కించుకుని ప్రయాణాన్ని ప్రారంభించారు. వెళ్తున్నక్రమంలో వాంగిడి మండలంలోని ఇప్పల్‌నవేగం సమీపంలోకి చేరుకోగానే జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. దీంతో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు ఇది గమనించి అంబులెన్సుకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు టీచర్లను ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని మంచిర్యాలకు తరలిస్తుండగా మంజుల మార్గ మధ్యలో మృతి చెందారు. మరో టీచర్ నిర్మల గాయాలతో చికిత్స పొందుతున్నారు. దీంతో మంజుల కుటుంబంలో విషాదం నెలకొంది.