iDreamPost
android-app
ios-app

వీడియో: వీడేమి స్కూల్ మాస్టర్? రోడ్డుపై విద్యార్థులను కాలితో తన్నుతూ!

  • Published Aug 12, 2024 | 4:22 PM Updated Updated Aug 12, 2024 | 5:47 PM

Tamilnadu: ప్రపంచంలో ఎక్కడైనా సరే తమకు విద్య నేర్పే గురువులను దైవంగా భావిస్తారు. అందుకే సమాజంలో గురువులకు ఉన్నత స్థానం కల్పించారు. కానీ ఈ మధ్య కొందతమంది టీచర్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

Tamilnadu: ప్రపంచంలో ఎక్కడైనా సరే తమకు విద్య నేర్పే గురువులను దైవంగా భావిస్తారు. అందుకే సమాజంలో గురువులకు ఉన్నత స్థానం కల్పించారు. కానీ ఈ మధ్య కొందతమంది టీచర్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

వీడియో: వీడేమి స్కూల్ మాస్టర్? రోడ్డుపై విద్యార్థులను కాలితో తన్నుతూ!

తల్లిదండ్రులు పిల్లలను కనీ పెంచుతారు. వారికి క్రమ శిక్షణ నేర్పి,విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప స్థానాన్ని పొందేలా చేస్తారు గురువులు. అందుకే తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం గురువులకు కల్పించారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరాః అని త్రిమూర్తులతో పోలుస్తారు. గురు శిష్యుల మద్య అనుబంధం ఎంతో గొప్పగా ఉంటుంది. కానీ ఈ మధ్య కొంతమంది గురువులు ఆ స్థానానికి మచ్చ తెస్తున్నారు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, ఎఫైర్లు నడపడం, దారుణంగా హింసించడం, మద్యం సేవించి పాఠశాలకు రావడం ఎన్నో నీచాలకు తెగబడుతున్నారు. ఓ చిన్న కారణంతోనే విద్యార్థులను చితకబాదిన పీఈటీ బాగోతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఫుట్‌బాల్ టోర్నీలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యర్థి టీమ్ చేతిలో ఓడిపోయారు.. అంతే విద్యార్థులపై పీఈటీ భగ్గుమన్నాడు. గ్రౌండ్ లో వరుసగా కూర్చోబెట్టి దారుణంగా కొట్టి హింసించాడు. అక్కడ ఉన్నవారంతా వారిస్తున్నా రెచ్చిపోయి మరి కొట్టాడు. ఈ తంతంగా అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి అతనని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఈ ఘటన తమిళనాడులోని సేలం లో జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.. ఇలాంటి గురువుకు తగ్గ శాస్తి జరిగిందని ఫైర్ అవుతున్నారు. గెలుపు, ఓటమి కామన్.. ఆ మాత్రం జీర్ణించుకోలేనివాడు పీఈటీ ఎలా అయ్యాడని ప్రశ్నిస్తున్నారు.

తమిళనాడు సేలం జిల్లా మెట్టూరు సమీపంలో ఇటీవల స్కూల్స్ టోర్నమెంట్స్ జరిగాయి. ఇందులో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు వేరే స్కూల్ విద్యార్థులతో ఫుట్‌బాట్ మ్యాచ్ అడారు. కొద్ది తేడాతో విద్యార్థులు ఓటమిపాలయ్యారు.  అది జీర్ణించుకోలేకపోయాడు ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్. తన పరువు తీశారు అంటూ విద్యార్థులను ఇష్టమొచ్చినట్లు కొట్టి, కాళ్లతో తన్ని, జుట్టు పట్టుకొని ఈడ్చిపడేసి, చెప్పుతో కొట్టాడు. ఈ దారుణాన్ని అపడానికి కొంతమంది ముందుకు వచ్చినా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ కావడంతో సదరు పీఈటీని విధుల నుంచి తొలగించారు. అంతేకాదు విద్యార్థులనై చేయి చేసుకున్నందుకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.