iDreamPost
android-app
ios-app

ఆరుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపు.. కీచక టీచర్ అరెస్ట్!

  • Published Aug 21, 2024 | 2:17 PM Updated Updated Aug 21, 2024 | 2:17 PM

Maharashtra: దేశంలో నిత్యం ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా కామాందుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. దారుణం ఏంటంటే గురువు స్థానంలో ఉన్న కొందరు కీచకులుగా మారి లైంగిక వేధింపులకు పాల్పపడుతున్నారు.

Maharashtra: దేశంలో నిత్యం ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా కామాందుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. దారుణం ఏంటంటే గురువు స్థానంలో ఉన్న కొందరు కీచకులుగా మారి లైంగిక వేధింపులకు పాల్పపడుతున్నారు.

ఆరుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపు.. కీచక టీచర్ అరెస్ట్!

తల్లిదండ్రులు పిల్లలను కంటే వారికి క్రమశిక్షణ, విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులు తీసుకుంటారు. అందుకే  గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని త్రిమూర్తులతో పోల్చుతారు. తల్లిదండ్రుల తర్వాత గురువులకు ఎంతో గొప్ప స్థానం కల్పించబడింది. గురు శిష్యుల సంబంధం ఎంతో పవిత్రంగా ఉంటుంది. కానీ ఈ మధ్య కొంతమంది గురువులు ఆ స్థానానికి కలంకం తెస్తున్నారు. విద్యాలయాలకు మద్యం సేవించి రావడం, విద్యార్థులు, సహ టీచర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది విద్యార్థినులకు నీలి చిత్రాలు చూపిస్తూ లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడికి పోలీసులు తగిన శాస్తి చేశారు. వివరాల్లోకి వెళితే..

దేశంలో రోజు రోజుకీ కామాంధులు రెచ్చిపోతున్నారు.. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు. ఒంటరిగా ఆడవాళ్లు కనిపిస్తే చాలు మృగాళ్లుగా మారిపోతున్నారు. మహరాష్ట్రలో టాయిలెట్ లో ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అకోలా జిల్లాకు చెందిన ఓ స్కూల్ టీచర్ ఆరుగురు బాలిలకలకు అశ్లీల వీడియోలు చూపించి లైంగికంగా వేధించాడని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు నెలలుగా ఆ టీచర్ విద్యార్థునులకు వీడియోలు చూపించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని భరితపూజ చేశారు.

బాలల సంక్షేమ కమిటీ టోల్ ఫ్రీ నెంబర్ కు ఆ ఆరుగురు అమ్మాయిలు కాల్ చేయడంతో కీచక టీచర్ గుట్టు రట్టయ్యింది. కాగా, ఆ కమిటీ సభ్యులు మంగళవారం అకోలాలోని స్కూల్ కు వచ్చి.. విద్యార్థునులతో మాట్లాడారు. తమను నాలుగు నెలల నుంచి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశాడని.. వీడియోలు చూపించేవాడని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు.విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలు రావడంతో ఆ ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.