iDreamPost
android-app
ios-app

అర్థరాత్రి జోరు నిద్రలో భార్య… ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా షాక్!

  • Published Jul 19, 2023 | 3:32 PM Updated Updated Jul 19, 2023 | 3:32 PM
  • Published Jul 19, 2023 | 3:32 PMUpdated Jul 19, 2023 | 3:32 PM
అర్థరాత్రి జోరు నిద్రలో భార్య… ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా షాక్!

సిద్దిపేట జిల్లాకు చెందిన ఈ దంపతులకు గతేడాది వివాహ జరిగింది. వివాహ అనంతరం ఈ భార్యాభర్తల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇక భర్త స్థానికంగా పని చేస్తూ ఉండగా భార్య ఇంటి వద్దే ఉండేది. ఇలా వీరి సంసారం కొన్నాళ్ల పాటు ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగానే ముందుకు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ రోజు రాత్రి ఈ దంపతులు భోజనం చేసి నిద్రపోయారు. కట్ చేస్తే.. అర్థరాత్రి మధ్యలో భర్తకు మెలుకువ వచ్చి భార్య వైపు చూడగా జోరుగా నిద్రలోకి జారుకుంది. ఇదే మంచి సమయం అనుకున్న ఇతగాడు ఊహించని పని చేసి అందరికీ షాకిచ్చాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామం. ఇక్కడే కనకరాజు-భవాని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది కిందట వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే ఉన్నారు. కానీ, కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు భగ్గుమన్నాయి. దీంతో అనేకసార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే భవాని తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయితి పెట్టించి నచ్చ జెప్పారు. అలా కొంత కాలం బాగానే మెలిగారు.

ఇకపోతే, ఇటీవల ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక అదే రోజు రాత్రి పూట ఆ దంపతులు భోజనం చేసి నిద్రపోయారు. కట్ చేస్తే.. అదే రోజు అర్థరాత్రి భర్త కనకరాజుకు సడెన్ గా మెలుకువ వచ్చింది. నా పరువు తీసిన భార్యను ప్రాణాలతో లేకుండా చేయాలని భావించాడు. ఇక ఇందులో భాగంగానే జోరు నిద్రలో ఉన్న భార్య భవానిని భర్త కనకరాజు ముఖంపై దిండు అదిమి ఊపరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత కనకరాజు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇక మరుసటి రోజు ఉదయం ఈ విషయం మృతురాలి తల్లిదండ్రులకు తెలియడంతో గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన కనకరాజు దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: భర్తకు పాద పూజ చేసి.. ఎంతకు తెగించింది!

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet giriş