iDreamPost
android-app
ios-app

భర్తకు పాద పూజ చేసి.. ఎంతకు తెగించింది!

  • Published Jul 19, 2023 | 11:04 AM Updated Updated Jul 19, 2023 | 11:04 AM
  • Published Jul 19, 2023 | 11:04 AMUpdated Jul 19, 2023 | 11:04 AM
భర్తకు పాద పూజ చేసి.. ఎంతకు తెగించింది!

 ఇష్టం లేని పెళ్లి కారణంగా ఓ యువతి తన భర్తను చంపించింది. పక్కా పథకం ప్రకారం తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఈ సంఘటన కర్ణాటకలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన శంకర్‌ జగముత్తి అనే 25 ఏళ్ల వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే యువతితో 5 నెలల క్రితం పెళ్లయింది. పెళ్లయిన నాటి నుంచి భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటున్నారు. ప్రియాంక తన భర్తతో ఎంతో ప్రేమగా నడుచుకునేది. ఇద్దరి మధ్యా ప్రేమను చూసి కుటుంబసభ్యులు, పొరిగింటి వారు.. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనుకునేవాళ్లు.

నిన్న భీమన అమావాస్య సందర్బంగా ప్రియాంక తన భర్త శంకర్‌కు పాద పూజ చేసింది. ఆ తర్వాత బనసిద్ధేశ్వర దేవస్థానానికి పోదామని భర్తను అడిగింది. అతడు సరేనన్నాడు. ఇద్దరూ గుడికి వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి శంకర్‌ను కత్తితో పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. కత్తి పోట్ల కారణంగా శంకర్‌ చనిపోయాడు. భర్త చనిపోవటంతో ప్రియాంక కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శంకర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శంకర్‌ను భార్య ప్రియాంకే హత్య చేయించినట్లు తేలింది. ఆమెకు పెళ్లికి ముందు శ్రీధర్‌ అనే ప్రియుడు ఉన్నాడు. ఇష్టం లేకుండా శంకర్‌తో పెళ్లి జరిగింది. దీంతో ఎలాగైనా భర్తను చంపి, ప్రియుడు శ్రీధర్‌తో వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. పథకం ప్రకారం శ్రీథర్‌తో శంకర్‌ను చంపించింది. ఇక, పోలీసులు శ్రీధర్‌, ప్రియాంకలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibom