iDreamPost
android-app
ios-app

టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలోనే ఆపేసిన డాక్టర్! బిత్తరపోయిన పేషెంట్స్!

ఆస్పత్రిలో బిల్లు కట్టలేదని వైద్యులు చికిత్స చేయడం ఆపేస్తారు. కానీ, ఓ వైద్యుడు మాత్రం.. అడిగినప్పుడు టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలోనే ఆపేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆస్పత్రిలో బిల్లు కట్టలేదని వైద్యులు చికిత్స చేయడం ఆపేస్తారు. కానీ, ఓ వైద్యుడు మాత్రం.. అడిగినప్పుడు టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలోనే ఆపేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలోనే ఆపేసిన డాక్టర్! బిత్తరపోయిన పేషెంట్స్!

మాములుగా ఏదైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదిస్తాము. సర్జీర తప్పనిసరి అంటే అదే హాస్పటల్ లో జాయిన్ అవుతాం. ఇక ఆపరేషన్ ముందే కొంత ఫీజు చెల్లించాలి, అలా జరగని సమయంలో డాక్టర్లు సర్జరీ చేయడానికి ముందుకు రారు. ఇలాంటి ఘటనలు మనం గతంలో చాలా విన్నాం, చూశాం కూడా. కానీ, ఓ డాక్టర్ మాత్రం.. సర్జరీకి ముందు టీ ఇవ్వలేదని ఓ వైద్యుడు కోపంతో ఊగిపోయాదు. ఇక అదే మనసులో పెట్టుకుని పేషెంట్స్ సర్జరీ మధ్య నుంచే వచ్చేశాడు. ఇటీవల చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

మీడియా కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాగ్ పూర్ జిల్లాలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తేజ్ రామ్ భులవి అనే వ్యక్తి వైద్యుడిగా పని చేస్తున్నారు. అయితే ఇటీవల ఇదే ప్రాంతానికి చెందిన నలుగురు మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఇదే ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు వెంటనే స్పందించి వారి ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ మహిళలకు ఆపరేషన్ చేసేందుకు వైద్యుడు తేజ్ రామ్ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఇతను టీ ఇవ్వాలని సిబ్బందిని అడిగారు. కానీ, ఆ సమయంలో ఎవరూ స్పందించలేదు. దీంతో డాక్టర్ కోపంతో ఊగిపోయాడు.

అదే ఆవేశంతో వెంటనే ఆపరేషన్ థియేటర్ కు వెళ్లాడు. సర్జరీలో భాగంగానే ఆ నలుగురు మహిళలకు మత్తు మందు ఇచ్చాడు. టీ ఇవ్వలేదన్న కోపం డాక్టర్ తేజ్ రామ్ ని వెంటాడుతూనే ఉంది. ఇక పట్టరాని కోపంతో డాక్టర్ తేజ్ రామ్ సర్జరీ మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చాడు. ఏం జరిగిందని కొందరు వైద్యులు అతడిని ప్రశ్నించగా.. నాకు అడిగినప్పుడు టీ ఇవ్వలేదని, అందుకే సర్జరీ చేయనని తెగేసి చెప్పాడు. అతని మాటలు విన్న మిగత వైద్యులు షాక్ గురయ్యారు. చాలా సేపు గడిచినా డాక్టర్ తేజ్ రామ్ ఆ మహిళలకు సర్జరీ చేయలేదు. అసలు విషయం తెలుసుని ఆ నలుగురు పేషెంట్స్ ఒక్కసారిగా బిత్తరపోయారు. ఇతని తీరుపై వెంటనే అప్రమత్తమైన మిగతా వైద్యులు జిల్లా ఆస్పత్రి నుంచి మరో వైద్యుడిని తీసుకొచ్చి మొత్తానికి ఆ నలుగురు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు.

అయితే డాక్టర్ తేజ్ రామ్ తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. జిల్లా అధికారులు సైతం స్పందించి ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అన్ని వివరాలు తెలుసుకుని జిల్లా అధికారులు డాక్టర్ తేజ్ రామ్ భులవిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంతే కాకుండా ఐపీసీ సెక్షన్ 304 కింద అతనిపై కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ తేజ్ రామ్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.