టిఫిన్ ఆర్డర్ ఇస్తే డ్రగ్స్ సరఫరా! ఇలా జరిగిందా?

వరలక్ష్మి టిఫిన్ సెంటర్.. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఈ టిఫిన్ సెంటర్ లో వారం రోజుల కిందటి వరకు వేడి వేడి టిఫిన్ మాత్రమే దొరుకుతుందని చాలా మందికి తెలుసు. కానీ, ఇక్కడ టిఫిన్ తో పాటు డ్రగ్స్ కూడా దొరుకుతుంది. గత కొన్నాళ్ల నుంచి చాప కింద నీరులా సాగిన ఈ డ్రగ్స్ దందా కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు టిఫిన్ సెంటర్ పై దాడులు చేశారు.

ఈ దాడుల్లో టిఫిన్ సెంటర్ నిర్వాహకులతో పాటు మరి కొంతమంది అనుమానితులను సైతం అదుపులోకి తీసుకుని కొకైన్ ను స్వాధీనం చేసుకునారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే పైకి టిఫిన్ సెంటర్ లా కనిపిస్తున్నా.. లోపల మాత్రం యాదేచ్చగా డ్రగ్స్ సరఫరా కొనసాగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇకపోతే, ఈ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు కోరిన వ్యక్తులకు డ్రగ్స్ ను ఎలా చేరవేసేవాళ్లు? ఎవరికీ అంతుచిక్కని ప్లాన్ తో పోలీసులను ఎలా బురిడి కొట్టించారనే అంశంపై తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

డ్రగ్స్ సరఫరా ఎలా జరిగిందంటే?

సాంకేతిక యుగం కొత్త పుంతలు తొక్కడంతో నగరంలోని ప్రజలు ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా ఫోన్ నుంచే టిఫిన్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. ఆర్డర్స్ పెట్టిన నిమిషాల్లోనే డెలవరీ బాయ్ ఇంటికొచ్చి మరీ ఫుడ్ ను ఇచ్చి వెళ్లిపోతాడు. అయితే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ఇక్కడి నుంచే యదేచ్చగా డ్రగ్స్ సరఫరాకు ప్లాన్ గీశారు. అదెలా అంటే? వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో డ్రగ్స్ సరఫరా అవుతుందని కొంతమంది తెలుసుకున్నారు. ఇదంతా మెల్ల మెల్లగా నగరంలోని చాలా మందికి తెలిసిపోయింది. కాగా, ముందుగా డ్రగ్స్ కావాలనుకున్న వ్యక్తులు టిఫిన్ కోసం అన్నట్లుగా వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కు ఆర్డర్ పెడతారు.

వచ్చిన ఆ ఆర్డర్ నెంబర్ ఆధారంగానే ఆ సెంటర్ నిర్వాహకులు ఏం తెలియనట్టుగా టిఫిన్ మాదిరి డ్రగ్స్ ప్యాక్ చేసి ఆ పార్శల్ ను కోరిన వ్యక్తికి పంపిస్తారు. ఎలాగో ఆ డెలవరీ బాయ్ దాన్ని ఓపెన్ చేయడానికి ఏ మాత్రం ఆస్కారం ఉండదు. దీన్నే ఆసరాగా చేసుకున్న వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ప్రముఖ డెలవరీ సంస్థలైన స్విగ్గీ, జుమాటో వంటి డెలవరీ బాయ్స్ కు తెలియకుండా చాలా కాలంగా ఈ డ్రగ్స్ దందాను నడిపినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు వెంటనే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ పై దాడులు నిర్వహించి డ్రగ్స్ దందాను బట్టబయలు చేశారు. ఆ తర్వాత పోలీసులు టిఫిన్ సెంటర్ నిర్వహకులతో పాటు మరికొంతమంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ చికటి బాగోతం ఎలా నడిచిందో వివరిస్తూ తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

Show comments