iDreamPost
android-app
ios-app

పల్లెటూరి వాడివంటూ భర్తను వేధించిన భార్య! అతడు చేసిన పనికి..!

  • Published Sep 15, 2023 | 1:15 PM Updated Updated Sep 15, 2023 | 1:15 PM
  • Published Sep 15, 2023 | 1:15 PMUpdated Sep 15, 2023 | 1:15 PM
పల్లెటూరి వాడివంటూ భర్తను వేధించిన భార్య! అతడు చేసిన పనికి..!

భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. ఆ సమయంలో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ ఉంటారు. అలా గొడవపడి తిరిగి ఉదయానికల్లా మళ్లీ కలిసిపోతుంటారు. కానీ, ఓ భార్య మాత్రం భర్తను అతి దారుణంగా అవమానిస్తూ తరుచు వేధింపులకు పాల్పడేది. భార్య అవమానాన్ని తట్టుకోలేని ఆ భర్త ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతడు చేసిన పనికి అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక తమకూరు జిల్లా తిపటూరు పరిధిలోని కిబ్బనహళ్లి ప్రాంతం. ఇక్కడే ముంజునాథ్ (38)-ప్రియాంక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 10 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే భర్త బెంగుళూరు మెట్రోలో ఇంజనీర్ గా పని చేస్తూ ఉండేవాడు. అలా కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే గడిపారు. కానీ, రాను రాను ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు భగ్గుమన్నాయి. దీంతో భార్య భర్తను అవమానిస్తూ దూషణలకు దిగేది. నీవు పల్లెటూరి వాడివంటూ ఘోరంగా అవమానిస్తూ వేధింపులకు పాల్పడేది.

కట్టుకున్న భార్యే మొహం మీద అలా అనడంతో మంజునాథ్ తట్టుకోలేకపోయాడు. ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకున్నాడో ఏమో కానీ.. మంజునాథ్ తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. మరో విషయం ఏంటంటే? భార్య వేధింపుల కారణంగానే మంజునాథ్ బలవన్మరణానికి పాల్పడినట్లు అతడు తన సోదరుడికి ఆడియో మెసేజ్ పంపినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ గురయ్యారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet