సినిమా తరహాలో స్కూల్ టీచర్ పై దారుణం!

నేటి సమాజంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇలా ఎంతో అభివృద్ధి పథంలో వెళ్తున్న.. వారిపై జరుగుతున్న దాడులు, వేధింపులు, ఇతర ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే మహిళ విషయంలో ఎన్నో ఘటనలు జరగ్గా.. తాజాగా కర్నాటకలో స్కూల్ టీచర్ విషయంలో దారుణం చోటుచేసుకుంది.

నేటి సమాజంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇలా ఎంతో అభివృద్ధి పథంలో వెళ్తున్న.. వారిపై జరుగుతున్న దాడులు, వేధింపులు, ఇతర ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే మహిళ విషయంలో ఎన్నో ఘటనలు జరగ్గా.. తాజాగా కర్నాటకలో స్కూల్ టీచర్ విషయంలో దారుణం చోటుచేసుకుంది.

నిత్యం సమాజంలో అనేక  నేరాలు-ఘోరాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ఘటనలు అందరిని కలవరానికి గురి చేస్తున్నాయి. ప్రేమ, పెళ్లి వంటి కారణాలతో యువతులపై కొందరు దారుణానికి తెగబడుతుంటారు. ప్రేమించామని వెంటబడి.. ఒప్పుకోకుంటే అమ్మాయిలపై హత్య చేసిన ఘటనలు అనేకం జరిగాయి. మరికొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగి.. కాదంటే కిడ్నాప్ లకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా కర్నాటక రాష్ట్రంలో స్కూల్ టీచర్ పై అలాంటి ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లా బిట్టగౌడనహళ్లి సమీపంలో వివాహానికి అంగీకరించలేదని అర్పిత అనే పాఠశాల ఉపాధ్యాయిని దుండగులు కిడ్నాప్ చేశారు. గురువారం ఉదయం సదరు టీచర్ పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఉపాధ్యాయురాలి బంధువు రాము ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. అనుమానిస్తున్నారు. అర్పిత, అనుమానితుడు బంధువులు. ఈ నేపథ్యంలో అతడు ఆమెను కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకోవాలని కోరినట్లు స్థానికులు తెలిపారు.

ఈ క్రమంలోనే 15 రోజుల క్రితం అర్పిత ఇంటికి రాము, అతడి తల్లిదండ్రులు వెళ్లారు. అర్పిత కుటుంబ సభ్యులతో పెళ్లి ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే అర్పిత, ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. పెళ్లికి అంగీకరించకపోవడంతో సదరు యువతిపై రాము కోపం పెంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే  గురువారం ఉదయం అర్పితను కిడ్నాప్ చేశాడని రాముపై యువతి బంధువులు  అంటున్నారు. ఈ ఘటన హసన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు.

యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాము, అతడి తల్లిదండ్రులు తమ కూతురికి పెళ్లికి అడగడానికి వచ్చారని,  కానీ తమకు ఇవ్వవద్దని చెప్పామని తెలిపారు. అర్పిత  కూడ నో చెప్పినందుకే ఈ కిడ్నాప్ చేశారని అర్పిత తల్లి ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేప్టటారు. నిందితుల ఆచూకీ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. బంధువు రాము ఆమెను కిడ్నాప్ చేశాడని అర్పిత కుటుంబ సభ్యులు ఆరోపించారని జిల్లా ఎస్పీ మహ్మద్ సుజీత తెలిపారు.

ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ప్రేమించలేదని కొందరు, పెళ్లి చేసుకోలేదని మరికొందరు ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొందరు యువత సైకోల్లా మారి.. హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి వారికి కఠిన శిక్ష వేస్తేనే.. ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని జనం డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఇలాంటి  కిడ్నాప్ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments