iDreamPost
android-app
ios-app

షాకింగ్: చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక!

  • Published Aug 18, 2023 | 10:06 PM Updated Updated Aug 18, 2023 | 10:06 PM
  • Published Aug 18, 2023 | 10:06 PMUpdated Aug 18, 2023 | 10:06 PM
షాకింగ్: చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక!

చికెన్ అంటే నాన్ వేజ్ ప్రియులు లొట్టలేసుకుని మరీ తింటుంటారు. మాంస ప్రియులకు వారంలో కనీసం మూడు సార్లు చికెనో మటనో తినాల్సిందే. ఇక కొంతమందికి మాత్రం రోజూ ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి. అయితే ఆదివారం అనురాగ్ సింగ్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి ముంబై బాంద్రా వెస్ట్ లోని పాలిహిల్ రెస్టారెంట్ కు వెళ్లారు. ఇక అక్కడికి వెళ్లాక చికెన్, బ్రేడ్ తో మటన్ తాలి ఆర్డర్ చేశారు. దీంతో ఇద్దరు తినేందుకు సిద్దమయ్యారు. వేడి వేడిగా తీసుకొచ్చిన చికెన్ కర్రీని వేసుకుని రెండు ముద్దలు తిన్నారు. ఇక బౌల్ లో ఉన్న చికెన్ ముక్క వేసుకోవాలనే చూసే లోపే.. ఆ చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక కనిపించింది. దాన్ని చూసి వాళ్లు ఒక్కసారిగా తిన్నదంతా బయటకు కక్కారు.

దీంతో అప్రమత్తమైన ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే రెస్టారెంట్ సిబ్బంది, మేనేజర్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక ఏంటని గట్టిగా ప్రశ్నించారు. ఏం చెప్పాలో తెలియక ఆ రెస్టారెంట్ సిబ్బంది, మేనేజర్ నోట్లో నీళ్లు నమిలారు. అనంతరం ఆ యువకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే వీడియోలు వైరల్ గా మారి చివరికి మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల దృష్టికి వెళ్లింది.

దీంతో ఆ అధికారులు వెంటనే స్పందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని రెస్టారెంట్ అంతా తనిఖీ చేశారు. ఆ తర్వాత ఈ రెస్టారెంట్ ను పూర్తిగా మూసివేయాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ దెబ్బకు ఆ రెస్టా రెంట్ మూసి వేయాల్సి వచ్చింది. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక చూసిన నెటిజన్స్ షాక్ గురవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

ఇది కూడా చదవండి: వీడియో: నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన యువతి

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobetcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom