iDreamPost

వీడియో: నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన యువతి

వీడియో: నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన యువతి

ఓ యువతి నడి రోడ్డుపై హల్ చల్ చేసింది. పోలీసు అని కూడా చూడకుండా అతనిపై వాగ్వాదానికి దిగింది. ఇంతే కాకుండా అందరూ చూస్తుండగానే ఆ యువతి పోలీస్ అధికారి చెంప చెళ్లు మనిపించింది. ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను చూసి నెటిజన్స్ ఒక్కోరు ఒకలా స్పందిస్తున్నారు.

డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిపై యువతి ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదని కొందరు కామెంట్స్ చేస్తుంటే.., ఇంతకు ఆ యువతి కానిస్టేబుల్ పై ఎందుకు దాడి చేసింది. పోలీసులు విచారణ జరిపి ఒకవేళ కావాలనే చేసి ఉంటే ఆ యవతిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇదే కాకుండా మరి కొందరు మాత్రం.. ఈ ఘటన వెనకాల ఏం జరిగిందనే పూర్తి అవగాహన లేకుండా ఆ యువతిపై నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదని మరి కొందరు వాదిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: తండ్రిని చంపాలని చూసిన కూతురు!ఎందుకో తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి