iDreamPost
android-app
ios-app

పురుషులే ఆమె టార్గెట్.. కిలేడీ గుట్టు విప్పిన పోలీసులు

ఈ మద్య కాలంలో చాలా తక్కువ సమయంలో ఎక్కుడ డబ్బు సంపాదించాలనే కోరికతో చెడు మార్గాలు ఎన్నుకుంటున్నారు. దారిదోపిడి, చైన్ స్నాచింగ్ ఇతర అక్రమదందాలకు పాల్పపడుతున్నారు.

ఈ మద్య కాలంలో చాలా తక్కువ సమయంలో ఎక్కుడ డబ్బు సంపాదించాలనే కోరికతో చెడు మార్గాలు ఎన్నుకుంటున్నారు. దారిదోపిడి, చైన్ స్నాచింగ్ ఇతర అక్రమదందాలకు పాల్పపడుతున్నారు.

పురుషులే ఆమె టార్గెట్.. కిలేడీ గుట్టు విప్పిన పోలీసులు

ఇటీవల కొంతమంది ఈజీ మనీ కోసం ఎలాంటి పనులకైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేసి సింపుల్ గా డబ్బులు దోచేస్తున్నారు. మనీ స్కీమ్, చిట్టీల పేరుతో కొంతమంది ఆడవాళ్లు అమాయకులను బురిడీ కొట్టించి అందినంత దోచుకొని ఉడాయిస్తున్నారు. మరికొంతమంది మహిళలు రోడ్లపై వాహనదారులను లిఫ్ట్ అడుగుతూ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిన తర్వాత వారిని బెదిరించి డబ్బు, బంగారం దోచుకొని పారిపోతున్నారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఇలాంటి వారిని పట్టుకొని జైల్లో పెడుతున్నా.. బయటికి వచ్చి మళ్లీ అదే పనులు కొనసాగిస్తున్నారు. ఓ మహిళ పురుషులను టార్గెట్ చేసుకొని దోచుకుంటుంది. వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలో బాచారం వాసి బొడిగె అర్చన (35). రెండు సంవత్సరాల 16 ఏళ్ల వయసు ఉన్న అర్చన కూతురు చనిపోయింది. అప్పటి నుంచి అర్చన మానసికంగా కృంగిపోయింది. పదే పదే తన కూతురుని గురుతు చేసుకొని బాధపడుతూ ఉండేది. తన పేదరికం వల్ల కూతురుని పోగొట్టుకున్నానని మదనపడింది. అదే సమయంలో అర్చన మరో వ్యసనానికి బాని అయ్యింది.  ఈజీ మనీ కోసం ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడింది.. కానీ దురదృష్టం ఆమెను వెంటాడింది.. లక్ష రూపాయల వరకు డబ్బు పోగొట్టుకుంది. అప్పటి నుంచి డబ్బు సంపాదించాలన్న కోపం, కసి పెరిగిపోయింది. ఇప్పడు ఉన్న పరిస్థితుల్లో న్యాయంగా పనిచేసి డబ్బు సంపాదించడం కష్టం అని అక్రమ మార్గం ఎంచుకుంది.

రోడ్డుపై అమాయకంగా నిలబడి వాహనదారులను ఆపి తనకు అర్జంట్ పని ఉందని కాస్త లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అంటూ బ్రతిలాడుతుంది. కొంత దూరం వెళ్లాక వాహనదారులను మాట్లలో పెట్టి పక్కకు ఆపమని చెప్పి వారిని బెదిరించి డబ్బులు, గోల్డ్ వస్తువులు తీసుకొని వెళ్లిపోతుంది. ఇలా కొంతకాలంగా బాగా డబ్బు సంపాదించింది అర్చన. రోడ్డుపై తరుచూ ఇలాంటి మహిళలు వేదిస్తున్నారని, డబ్బులు దోచుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు వచ్చాయి. ముంఖ్యంగా అర్చన బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపరిచితులకు లిఫ్ట్ ఇచ్చేముందు జాగ్రత్తలు పాటించాలి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి