ఇండియా- పాక్ మ్యాచ్ వ్లాగ్.. పాకిస్తాన్ యూట్యూబర్ ని కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డ్!

Pakistan Youtuber- Security Guard Issue: టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఒక యూట్యూబర్ తన ప్రాణాలు కోల్పోయాడు. మ్యాచ్ కి హైప్ క్రియేట్ చేయడానికి ఒక వ్లాగ్ చేస్తుండగా.. అతడిని సెక్యురిటీ గార్డు కాల్చి చంపేశాడు.

Pakistan Youtuber- Security Guard Issue: టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఒక యూట్యూబర్ తన ప్రాణాలు కోల్పోయాడు. మ్యాచ్ కి హైప్ క్రియేట్ చేయడానికి ఒక వ్లాగ్ చేస్తుండగా.. అతడిని సెక్యురిటీ గార్డు కాల్చి చంపేశాడు.

టీమిండియా- పాకిస్థాన్ మధ్య ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా ఒక ఘోరం జరిగింది. ఒక పాకిస్తాన్ యూట్యూబర్ దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీమిండియా- పాక్ మధ్య జరిగిన మ్యాచ్ కంటే ముంతే పాకిస్తాన్ కు చెందిన యూట్యూబర్ మ్యాచ్ మీద హైప్ క్రియేట్ చేసేందుకు ఒక వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఆ వ్లాగ్ అతని ప్రాణాలు తీస్తుంది అని మాత్రం తెలుసుకోలేకపోయాడు. అతను స్టార్ట్ చేసిన ఆ వ్లాగ్ కారణంగానే ఆ వ్యక్తి తన ప్రాణాలు కోల్పోయాడు. ఒక సెక్యూరిటీ గార్డు తన గన్నుతో ఆ యూట్యూబర్ ని కాల్చి చంపేశాడు.

అసలు ఏం జరిగిందంటే.. పాకిస్తాన్ కు చెందిన యూట్యూబర్ సాద్ అహ్మద్ ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించి కరాచీలోని మొబైల్ మార్కెట్లో అతను స్థానికుల అభిప్రాయాలు సేకరిస్తున్నాడు. ఆ సందర్భంగా అప్పటికే చాలా మంది షాపు యజమానుల నుంచి బైట్స్ సేకరించాడు. ఆ తర్వాత ఒక సెక్యూరిటీ గార్డ్ ని కూడా మ్యాచ్ కి సంబంధించి ప్రశ్నించాడు. అయితే అతను ముందు నుంచే తనను అడగొద్దని వారించాడని చెబుతున్నారు. సీసీటీవీలో కూడా కాల్చడానికంటే ముందే సెక్యూరిటీ గార్డ్- యూట్యూబర్ సమద్ అహ్మద్ మాట్లాడుకున్నట్లు కనిపించినట్లు చెప్పారు. సమద్ పదే పదే సెక్యూరిటీ గార్డుని అడగటం వల్లే అతను కాల్చినట్లు చెబుతున్నారు. సెక్యూరిటీ గార్డు కూడా అదే విషయాన్ని వెల్లడించాడు.

వద్దని చెబుతున్నా కూడా అతను పదే పదే మైకు తీసుకొచ్చి తన ముఖం మీద పెట్టినట్లు చెప్పాడు. తీసేయమన్నా వినకపోవడంతో అతనికి కోపం వచ్చింది అన్నాడు. తనకు కోపం రావడంతో గన్ తో కాల్చేశాను అని చెప్పుకొచ్చాడు. ఆ ఘటన తర్వాత యూట్యూబర్ సమద్ అహ్మద్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో కరాచీలోని మొబైల్ మార్కెట్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. యూట్యూబర్ ని కాల్చి చంపిన ఆ సెక్యూరిటీ గార్డుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అతను తనకు కోపం రావడంతోనే సమద్ ని కాల్చేసినట్లు వ్యాఖ్యానించాడు. ఈ ఘటనకు సంబంధించి యూట్యూబర్ సమద్ అహ్మద్ మిత్రుడు కొన్ని విషయాలు వెల్లడించాడు. సమద్ కుటుంబానికి అతనే ఆధారం అని.. అతడిని ఇలా చంపడంతో ఆ కుటుంబం రోడ్డున పడినట్లే అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఎందుకంటే ఇలాంటి ఘటన జరగడం విచారకరం అంటూ పలువురు క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments