పైన ఫోటోలో కనిపిస్తున్న వీళ్లిద్దరూ దంపతులు. భార్య అందాన్నిఆసరాగా చేసుకున్న భర్త ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డారు. మరో విషయం ఏంటంటే? దీనికి అతని భార్య కూడా సహకరించడం విశేషం. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు శనివారం ఈ దంపతులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఈ దంపతులు ఏం చేశారు? స్నేహం పేరుతో ఎలాంటి మోసానికి పాల్పడ్డారు? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఒడిస్సా భువనేశ్వర్ లోని ఓ ప్రాంతంలో రవి పాత్ర్-ఇరానీ పాత్ర్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లిద్దరూ డబ్బులు ఈజీగా ఎలా సంపాదించాలనే మార్గాలను వెతికారు. ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి విఫలమయ్యారు. ఈ క్రమంలోనే వీరికి ఓ ఐడియా తట్టింది. అదేంటంటే? ఇరానీ పాత్ర్ తన అందమైన ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. ఇంతే కాదంండోయ్.. అందమైన యువకులకు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి వాళ్లు యాక్సెప్ట్ చేయగానే వారితో మెల్లగా ఛాటింగ్ చేస్తుంది.
ఇక వారి ఫోన్ నెంబర్ తీసుకుని వారితో రెచ్చే గొట్టే విధంగా మాట్లాడుతూ మెల్లగా తన ముగ్గులోకి దింపుకుంటుంది. ఆ తర్వాత టైమ్ చూసి మెల్లగా తన ఇంటికి రప్పించుకుంటుంది. ఇక అతడు రాగానే తన బెడ్ రూంలోకి తీసుకెళ్లి అతనితో సన్నిహితంగా మెలుగుతుంది. ఇదంతా ఆమె భర్త మరో ఇద్దరు యువకులు సీక్రెట్ గా వీడియోలు తీయడం, తీసిన ఆ వీడియోలను ఆ యువకుడికి చూపించి బ్లాక్ మెయిల్ చేసి అందిన కాడికి దోచుకోవడం చేస్తుంటారు.
ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఇప్పటికీ ఎంతోమంది యువకులను మోసం చేస్తూ బంగారం, డబ్బు దోచుకుంటున్నారీ ముఠా సభ్యులు. అయితే ఇటీవల భువనేశ్వర్ కు చెందిన ఓ యువకుడి భార్యకు ఎయిమ్స్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఏకంగా రూ.3.60 లక్షలు కాజేశారు. దీంతో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఎట్టకేలకు ఈ దంపతుల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారించి వారిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.