Tirupathi Rao
New Pub Scam Came To Light In Mumbai: మార్కెట్ లోకి ఒక కొత్త తరహా డేటింగ్ యాప్స్ మోసం వచ్చింది. చాలా నైస్ గా ఆన్ లైన్ లో పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్లు చేసే మోసానికి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.
New Pub Scam Came To Light In Mumbai: మార్కెట్ లోకి ఒక కొత్త తరహా డేటింగ్ యాప్స్ మోసం వచ్చింది. చాలా నైస్ గా ఆన్ లైన్ లో పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్లు చేసే మోసానికి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.
Tirupathi Rao
ఇండియాలో మీరు ఇప్పటివరకు చాలానే మోసాలు చూసుంటారు. చాలా రకాల మోసాల గురించి విని ఉంటారు. ప్రజలు మోసాల గురించి తెలుసుకుని వాటి నుంచి తప్పించుకుంటున్నారు. కానీ, మోసగాళ్లు మాత్రం కొత్త తరహాలో మోసాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక పబ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆ స్కామ్ గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆన్ లైన్ లో ఉండే డేటింగ్ యాప్స్ లో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. దీపికా నారాయణ్ అనే జర్నలిస్ట్ ఈ కొత్త స్కామ్ ని సోషల్ మీడియాలో బయట పెట్టారు. డేటింగ్ యాప్స్ లో పరిచయం అయ్యి.. అబ్బాయిలను ఎలా నిండా ముంచేస్తున్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ గురించి మీరు వినే ఉంటారు. ఆ యాప్స్ ద్వారా చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. సాధారణంగా యాప్స్ లో పరిచయం అయిన వాళ్లు ఫోన్ నంబర్ తీసుకుని.. షాపింగ్ చేయించడం, గిఫ్ట్స్ కొనుగోలు చేయడం చేస్తారు. లేదంటే కొన్నిరోజుల తర్వాత ఎవరికో హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి డబ్బులు కాజేస్తారు. కానీ, ఈ తరహా మోసం మాత్రం మీ బుర్ర గిర్రుల తిరిగేలా చేస్తుంది. ఎందుకంటే ఈ అమ్మడు ఏకంగా మందు తాగేసి.. వేలల్లో బిల్లు చేస్తోంది. అది కూడా దాదాపుగా ఒక పబ్ లోనే ఇలా జరగడం గమనార్హం. వస్తున్న ఆరోపణలు చూస్తే.. ఆ పబ్ వాళ్లే కొందరు అమ్మాయిలను హైర్ చేసుకుని ఈ స్కామ్ చేయిస్తున్నారు అనే అనుమానాలు కూడా కలగకమానవు.
🚨 MUMBAI DATING SCAM EXPOSE 🚨
THE GODFATHER CLUB ANDHERI WEST
◾BRAZEN SCAMMING EVERYDAY
◾12 victims in touch
◾Trap laid through Tinder, Bumble
◾Bill amounts 23K- 61K
◾3 men trapped by same girl@MumbaiPolice @CPMumbaiPolice @mymalishka @CMOMaharashtra@zomato pic.twitter.com/qGOacFCE9f— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 23, 2024
ఇదతం జరుగుతోంది హైదరాబాద్ లో కాదులెండి.. ముంబయిలో. ఇప్పుడు అక్కడి కుర్రాళ్లను ఈ డేటింగ్ స్కామ్ కంగారు పెట్టేస్తోంది. ముందుగా టిండర్ లాంటి యాప్ లో ఒక అమ్మాయి తనని తాను పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత పది నిమిషాలకే నంబర్ అడుగుతుంది. వాట్సాప్ ఒక బిల్డింగ్ లొకేషన్ పెడుతుంది. అక్కడ ఒక పిజ్జా ఎక్స్ ప్రెస్ ఉంటుంది. అయితే మొదట అక్కడికి వెళ్లినా కూడా.. ఆ తర్వాత పక్కనే ఉన్న పబ్ కి వెళ్దాం అని తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత టకా టకా బ్లూ లేబుల్ పెగ్స్ ఆర్డర్ చేస్తుంది. ఒక పెగ్గు ధర రూ.2,499గా ఉంటుంది. ఇలా కాస్ట్లీ డ్రింక్స్ అన్నీ ఆర్డర్ చేస్తుంది. ఆ తర్వాత ఫైర్ వర్క్స్, హుక్కాను తెమ్మంటుంది. సడెన్ గా తనకు ఏదో పని ఉంది అని మాయం అయిపోతుంది.
MODUS OPERANDI :
◾Dating app connect
◾Push for quick meet
◾Meeting place Pizza Express or Metro
◾Then insists Godfather
◾Orders drink, hookah, fireshot
◾Guy isn’t shown menu card
◾Bill in thousands within hour
◾She absconds
◾Bouncers corner guy to beat if not paid pic.twitter.com/FhKP26yVUc— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 23, 2024
అమ్మాయి మాయం అయ్యాక.. తీరా బిల్లు చూస్తే రూ.25 వేల నుంచి రూ.61 వేల వరకు ఉంటుంది. ఆ బిల్లు కట్టాల్సిందే అని పబ్బు వాళ్లు గోల చేస్తారు. కట్టను అంటే కొడతారేమో అనే భయంతో కుర్రాళ్లు కట్టేస్తుంటారు. అలా ఇప్పటివరకు చాలామంది ఈ స్కామ్ కి గురయ్యారు. రూ.25 వేలు, రూ.35 వేలు, రూ.61 వేల వరకు బిల్స్ వచ్చాయి. వాళ్లంతా వాటిని గప్ చుప్ కట్టేశారు. ఆ తర్వాత వాళ్లు మోసపోయామని తెలుసుకుని ఫిర్యాదులు కూడా చేశారు. ఇది మొత్తం గాడ్ ఫాదర్ అనే పబ్ లో జరుగుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. గూగుల్ రివ్యూస్ లో కూడా బాధితులు ఆ విషయాన్ని వెల్లడిస్తున్నారు. చాలామంది పబ్ వాళ్లే ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు అనే అనుమానాలను వ్యక్త పరుస్తున్నారు. ఈ విషయంపై తక్షణమే ముంబయి పోలీస్ యాక్షన్ తీసుకోవాలి అని జర్నలిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. దీపికా నారాయణ్ తన ట్విట్టర్ లో పెట్టిన సమాచారం, తెలిపిన వివరాలకు సంబంధించి ముంబయి పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి స్పందించారు. సీనియర్ అఫీషియల్స్ ఈ విషయంపై చర్యలు తీసుకుంటారు అంటూ వెల్లడించారు. ముంబయిలో వెలుగు చూసిన ఈ కొత్త డేటింగ్ యాప్ మోసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
These aren’t men scamming men in guise of a woman online. These are real women confidently scamming a guy every single day. Some guys did try to report them but then the woman card & they got scared !!!
MUMBAI : Plz tag folks from CM office who can help
PLEASE SHARE 🙏🙏 pic.twitter.com/C9hCuNlQMT
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 23, 2024