iDreamPost
android-app
ios-app

దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

  • Published Jan 29, 2024 | 8:47 AM Updated Updated Jan 29, 2024 | 8:47 AM

Car Lorry Accident: దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. మృత్యువు వారిని పలకరించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆ వివరాలు..

Car Lorry Accident: దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. మృత్యువు వారిని పలకరించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆ వివరాలు..

  • Published Jan 29, 2024 | 8:47 AMUpdated Jan 29, 2024 | 8:47 AM
దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

భార్యాభర్త, ఇద్దరు చిన్నారులు, వారి బంధువులు మరో ఇద్దరూ కలిసి.. దైవదర్శనం కోసం విజయవాడ, ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లారు. దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. తమ కుటుంబాన్ని చల్లంగా చూడు తల్లి అని కోరుకున్నారు. బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వమని ఆ అమ్మను వేడుకున్నారు. దర్శనం ఎంతో బాగా జరిగింది. ఆ అమ్మను తలుచుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మరి కొన్ని క్షణాల్లో ఇంట్లో ఉంటాము అనుకున్నారు వారంతా. కానీ వారికేం తెలుసు.. తమ జీవితంలో ఇదే ఆఖరి రోజని. దైవదర్శనం చేసుకుని ఇంటికి వెళ్లి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పలకరించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరూ చిన్నారులు కూడా ఉన్నారు. ఆ వివరాలు..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని లారీ.. కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న అయిదుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్‌ (32) హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య జ్యోతి.. ఓ కుమార్తె సంతానం ఉన్నారు.

It's worse while going to see God

ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం మహేష్‌ కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఇతర ప్రాంతాలకు దైవదర్శనానికి వెళ్లాడు. అమ్మవారిని, ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించి.. మనసులోని కోరికలు విన్నవించుకుని.. తమను చల్లంగా చూడమని ప్రార్థించారు. దర్శనాలు పూర్తైన తర్వాత.. తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యారు.

ఈ క్రమంలో తిరుగు ప్రయాణంలో భాగంగా వారి స్వస్థలం మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వస్తుండగా.. అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఓ లారీ వెనుక నుంచి వచ్చి మహేష్‌ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్, అతడి భార్య జ్యోతి (30), కుమార్తె రిషిత (6), మహేశ్‌ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్‌ (32), ఆయన కుమారుడు లియాన్సీ (2) అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో మహేందర్‌ భార్య భూమా మాధవి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి.. అత్యవసర చికిత్స అందించారు. కానీ మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ తర్వాత ఆమెని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరి కొన్ని క్షణాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. లారీ రూపంలో మృత్యువు వారిని అక్కున చేర్చుకుందని.. పసివాళ్లు కూడా కన్ను మూశారని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.