iDreamPost
android-app
ios-app

ఫేక్ కాల్ తో టార్చర్.. పాపం, మౌనిక తట్టుకోలేకపోయింది!

  • Author naresh1 Published - 08:29 AM, Sat - 21 October 23

ఈ మధ్యకాలంలో కొందరు ఫేక్ రాయుళ్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఫేక్ గాళ్ల వేధింపులు తట్టుకోలేక ఓ బీటెక్ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం విషాదంగా మారింది.

ఈ మధ్యకాలంలో కొందరు ఫేక్ రాయుళ్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఫేక్ గాళ్ల వేధింపులు తట్టుకోలేక ఓ బీటెక్ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం విషాదంగా మారింది.

  • Author naresh1 Published - 08:29 AM, Sat - 21 October 23
ఫేక్ కాల్ తో టార్చర్.. పాపం, మౌనిక తట్టుకోలేకపోయింది!

ఈ మధ్యకాలంలో కొందరు ఫేక్ రాయుళ్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తెలిసిన వ్యక్తుల్లా ఫోన్ చేస్తూ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేకుంటే మీ అంతు చూస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఫేక్ గాళ్ల వేధింపులు తట్టుకోలేక ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నట్టుండి మౌనిక ఇలా చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన మౌనిక (22) కోదాడలోని ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. అయితే, ఇటీవల కొందరు ఫేక్ రాయళ్లు ఆ యువతికి ఫోన్ లు చేశారు. మీకు ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చిందని, అంతకంటే ముందు.. రూ.28,000 చెల్లించాలని కోరారు. ఇదంతా నిజమే అనుకున్న మౌనిక.. తన వద్ద లేకున్నా స్నేహితుల వద్ద అడిగి మరి కొంత డబ్బును చెల్లించింది. ఇక మరి కొన్ని రోజులు ఆ వ్యక్తులు మళ్లీ ఫోన్ చేసి.. మిగతా డబ్బు చెల్లించాలని అనేక రకాలుగా టార్చర్ చేశారు. కానీ, ఎందుకో మౌనికకు కాస్త అనుమానం వచ్చింది. వెంటనే తన స్నేహితులతో పాటు కాలేజ్ యాజమాన్యానికి జరిగిందంతా వివరించింది.

వెంటనే స్పందించిన యాజమన్యం.. ఇవి ఫేక్ కాల్స్ అంటూ ఆ యువతిని మందలించారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు కూడా వివరించడంతో మొత్తానికి మౌనికకు సర్దిచెప్పారు. కానీ, ఆ యువతి మాత్రం వారి టార్చర్ తో తట్టుకోలేకపోయింది. పరువుపోయిందనుకుందో ఏమో కానీ.. తాజాగా మౌనిక పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులు షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ రాయుళ్ల పట్ల యువతి, యువకులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.