iDreamPost
android-app
ios-app

గల్లీ క్రికెట్ కోసం.. రూ.6.72 లక్షలు పోగొట్టుకున్నాడు!

సాధారణంగా క్రికెట్ మ్యాచులు వస్తున్న సమయంలో బెట్టింగ్ కట్టి డబ్బులు పోగొట్టుకుంటున్న వారిని చూశాం. కానీ ఇతడు స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ డబ్బులు నష్టపోయాడు..

సాధారణంగా క్రికెట్ మ్యాచులు వస్తున్న సమయంలో బెట్టింగ్ కట్టి డబ్బులు పోగొట్టుకుంటున్న వారిని చూశాం. కానీ ఇతడు స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ డబ్బులు నష్టపోయాడు..

గల్లీ క్రికెట్ కోసం.. రూ.6.72 లక్షలు పోగొట్టుకున్నాడు!

ఆడవాళ్లకు సీరియల్స్, షాపింగ్ అంటే ఎంత పిచ్చో.. మగవాళ్లకు సినిమాలు, క్రికెట్ అంటే అంత క్రేజ్. టీవీల్లో క్రికెట్ మ్యాచ్ వస్తుంటే చాలు.. మన జట్టు కాకపోయినా వాచ్ చేస్తూ ఉంటారు. టెస్ట్, వన్డే, ఐపీఎల్ మ్యాచ్‌లు తీక్షణంగా చూస్తుంటారు. అంతేనా వీకెండ్ వస్తే చాలు ఫ్రెండ్స్ బెటాలియన్‌ను వేసుకుని దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడేస్తుంటారు. కనీసం ఇంటి ముందు సందు ఉన్నా చాలు గల్లీ క్రికెట్ ఆటాల్సిందే. ఈ క్రికెట్‌కు పదకొండు మంది ఉండక్కర్లేదు.. కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు తగ్గట్లుగా పిచ్ క్రియేట్ చేసుకుని చెలరేగి ఆడుతుంటారు. ఈ ఆట వారికో వ్యాపకంతో పాటు వ్యాయామం కూడా. కానీ ఈ సరదా ఓ వ్యక్తికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఏకంగా లక్షల రూపాయలు పోగోట్టుకోవాల్సి వచ్చింది.

స్నేహితులతో కలిసి సరదాగా గల్లీ క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు, తన పర్సు తీసి పక్కన పెట్టాడు. అందులో డబ్బులు లేకపోయినప్పటికీ.. అతడు ఆరు లక్షల రూపాయలను కోల్పోవలసి వచ్చింది. అలా ఎలా అనుకుంటున్నారా..అయితే ఇది చదవండి. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. గత నెల 30న దక్షిణ ముంబయిలోని క్రాస్ మైదాన్‌లో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు వివేక్ దవే. మొబైల్ ఫోన్, పర్సు తీసి పక్కన పెట్టాడు. పర్సులో క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నాయి. ఆటలో నిమగ్నమయ్యాడు. ఆట ముగిశాక.. బోరివలికి రైలులో ఇంటికి తిరిగి వెళుతుండగా.. మొబైల్ ఫోన్ చెక్ చేశాడు. అందులో బ్యాంకు లావాదేవీలు జరిగిన మేసేజెస్ వచ్చాయి.

తీరా చూస్తే.. అందులో లక్ష రూపాయలు కట్ అయినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా దుండగులు క్రెడిట్ కార్డు వినియోగించి.. రూ. ఐదు లక్షలు పైగా షాపింగ్ చేసినట్లు తేలింది. అప్పటి కానీ బోధపడలేదు తన క్రెడిట్, డెబిట్ కార్డు దొంగిలించారని. ఆటలో లీనమైన అతడు గమనించుకోలేదు.  ఇదే సరైన సమయం అని గమనించిన దుండగులు.. అతడి వ్యాలెట్ పై కన్నేసి క్రెడిట్, డెబిట్ కార్డులను దొంగిలించి ఏటీఎం నుండి రూ. 1 లక్ష నగదు విత్ డ్రా చేశారు. క్రెడిట్ కార్డుతో నాలుగు నగల దుకాణాల్లో షాపింగ్ కూడా చేశాడు. మొత్తంగా రూ. 6.72  లక్షలు కొల్లగొట్టారు. వెంటనే వివేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా నగల దుకాణాదారులను సంప్రదించగా సీసీ ఫుటేజ్ అందించారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.