iDreamPost
android-app
ios-app

శవమై దొరికిన క్రిప్టో బిలియనీర్.. చేతులు- కాళ్లు నరికి సూట్ కేసులో..!

  • Published Jul 28, 2023 | 9:55 PM Updated Updated Jul 28, 2023 | 9:55 PM
  • Published Jul 28, 2023 | 9:55 PMUpdated Jul 28, 2023 | 9:55 PM
శవమై దొరికిన క్రిప్టో బిలియనీర్.. చేతులు- కాళ్లు నరికి సూట్ కేసులో..!

ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిలియనీర్, ఇన్ ఫ్లూఎన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా దారుణంగా హత్యకు గురయ్యాడు. జులై 19న అతను కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అతని కోసం ఎక్కడ గాలించినా కూడా ఆచూకీ దొరకలేదు. తీరా ఇన్ని రోజుల తర్వాత అతని శవం దొరికింది. అది కూడా చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఒక సూట్ కోసులో అతని కాళ్లు, చేతులు ఉన్నాయి. టాటూలు, వేలిముద్రల ద్వారా అది ఫెర్నాండో పెరెజ్ మృతదేహం అని పోలీసులు గుర్తించారు. ఫెర్నాండో హత్యకు గురయ్యాడు అనగానే అంతా షాకయ్యారు.

అర్జెంటీనాకు చెందిన క్రిప్టో బిలియనీర్ ఫెర్నాండో పెరెజ్ కు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఫెర్నాండో జులై 19న కనిపించకుండా పోయాడు. తాజాగా అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లోని ఒక కాలువ సమీపంలో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అక్కడికి ఒక రెడ్ సూట్ కేస్ కొటుకుని వచ్చింది. దానిని తెరిచి చూడగా అందూలో శరీర భాగాలు ముక్కలుగా కోసి ఉన్నాయి. వాళ్లు వెంటనే పెద్దవాళ్ల సాయంతో పోలీసులకు విషయం తెలియజేశారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని సూట్ కేస్ స్వాధీనం చేసుకున్నారు. అందులో కాళ్లు, చేయి, కొన్ని శరీర భాగాలు దొరికాయి. చేతిపై టాటూలు, వేలి ముద్రల ఆధారంగా అది ఫెర్నాండో మృతదేహంగా పోలీసులు గుర్తించారు. కాస్త దూరంలో అతని మరో చేయి దొరికింది.

తర్వాత తల, మొండెం మిగిలిన శరీర భాగాలు దొరికాయి. వాటిని పోస్టుమార్టం చేయించగా వారికి షాకింగ్ నిజాలు తెలిశాయ. ముక్కలుగా నరికేందుకు ముందు అతని శరీరంలోకి మూడు బుల్లెట్లు దింపారని చెప్పారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇలా సూట్ కేస్ లో పెట్టి నదిలో పడేశారని భావిస్తున్నారు. ఇదంతా కచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసినగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని హత్యకు గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్గాబా చాలా అప్పులలో ఉన్నాడని.. అతనిపై చీటింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. లగ్జరీ కార్లు అద్దెకు ఇవ్వడం, క్రిప్టో కరెన్సీ విక్రయించడం చేస్తూ ఫెర్నాండో బిలియనీర్ అయ్యాడు. 24 ఏళ్లకే జెట్ స్కీ, లగ్జరీ కార్లు, సూపర్ బైక్స్ కొనుగోలు చేశాడు.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom giriş