దారుణం: ఒంటరి మహిళని గుంపుగా చేరి కొట్టారు! కారణం ఏమిటంటే?

కేవలం అలా చేసిందని ఓ మహిళను కొంతమంది పురుషులు అత్యంత దారుణంగా కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే మహిళపై దాడి చేస్తుంటే చోద్యం చూస్తున్నట్లు ఉండిపోయారు స్థానికులు.

కేవలం అలా చేసిందని ఓ మహిళను కొంతమంది పురుషులు అత్యంత దారుణంగా కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే మహిళపై దాడి చేస్తుంటే చోద్యం చూస్తున్నట్లు ఉండిపోయారు స్థానికులు.

వివాహేతర సంబంధాలు వివాహ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్నది కొందరి వాదన. అయితే మేజర్లైన మహిళ, పురుషుడు (ఇద్దరికీ పెళ్లైనా కూడా) శారీరక సంబంధం పెట్టుకుంటే.. సరైన చర్యేనంటూ సమర్థిస్తున్నాయి కోర్టులు. దీంతో బంధం విచ్ఛిన్నం అవుతుంది. అయితే  కొన్ని సార్లు ఈ బంధంలో కాంప్రమైజ్ అయ్యి బతకాల్సి వస్తుంది. భర్త లేదా భార్య.. పరాయి వ్యక్తుల మోజులో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోయినా.. పిల్లల కోసం కలిసి బతికేస్తున్న వారున్నారు. అయితే ఇల్లీగల్ కాంట్రాక్ట్ బయటపడితే.. భర్తలను రోడ్డుకు ఈడ్చేసిన భార్యల సంఘటనలు చూశాం. ఇప్పుడు ఓ మహిళ వివాహేతర సంబంధం నెరుపుతూ పట్టుబడటంతో ఆమెను బహిరంగంగా దాడి చేశారు పురుషులు.

మేఘాలయలో వివాహేతర సంబంధం నెరుపుతుందన్న కారణంగా నలుగురు వ్యక్తులు ఓ మహిళను బహిరంగంగా చితకబాదిన ఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటన వెస్ట్ గారోహిల్స్ జిల్లాలో దాడెంగ్రేలోని దిగువ టెక్సాగ్రే ప్రాంతంలో జరిగింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వీడియో క్లిప్ లో ఓ వ్యక్తి మహిళను కర్రతో కొట్టడం, జుట్టును పట్టుకుని లాగి నేలపై పడేయడం కనిపిస్తుంది. ఆమెను కొంత మంది పురుషులు అత్యంత దారుణంగా కొడుతుంటే.. గ్రామంలోని మహిళలు, వృద్దులు, మరికొంత మంది సినిమా చూసినట్లు చూశారు తప్ప.. ఆపేందుకు ప్రయత్నించలేదు. చోద్యం చూసినట్లు చూస్తూ నిలబడ్డారు. బహిరంగంగా ఆమెను అత్యంత హేయంగా శారీరకంగా హింసకు గురి చేశారు.

విచక్షణా రహితంగా చితకబాదారు. కర్రలతో వీపు మీద బాదుతూ.. జుట్టుపట్టుకుని తన్నారు. మరో వ్యక్తి ఆమెను కాలితో తన్నాడు. ఈ దృశ్యాలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి.  ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగుర్ని అరెస్టు చేశారు. మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అకారణంగా ఆమెను చావబాదారని వెల్లడించారు. ఇదిలా ఉండగా, మహిళా సాధికారతపై మేఘాలయ అసెంబ్లీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సుత్ంగా సైపుంగ్ ఎమ్మెల్యే శాంతా మేరీ షిల్లా ఈ సంఘటనకు సంబంధించిన నివేదికను పోలీసుల నుండి కోరారు. మహిళలపై ఎలాంటి నేరాలు జరిగినా అప్రమత్తంగా ఉండాలని మేఘాలయలోని మొత్తం 12 జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌ను కూడా కోరారు. ఈ ఘటనను మేఘాలయ స్టేట్ కమీషన్ ఫర్ ఉమెన్ (ఎంఎస్ సి డబ్ల్యు) సుమోటోగా స్వీకరించింది.

 

Show comments