పిల్లలు పువ్వులు తెంపారని.. తల్లి ముక్కు కోసిన కిరాతకుడు

బాల్యం ఎంతో అందమైనది. ఈ సమయంలోనే ఎన్నో చిలిపి, అల్లరి పనులు చేస్తూ తల్లిదండ్రులు, గురువులు, బంధువుల చేతుల్లో కొన్ని సార్లు చీవాట్లు, దెబ్బలు తింటుంటారు. అలాగే పిల్లలు చేసిన పనిని చాలా మంది సరదాగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ కిరాతకుడు..

బాల్యం ఎంతో అందమైనది. ఈ సమయంలోనే ఎన్నో చిలిపి, అల్లరి పనులు చేస్తూ తల్లిదండ్రులు, గురువులు, బంధువుల చేతుల్లో కొన్ని సార్లు చీవాట్లు, దెబ్బలు తింటుంటారు. అలాగే పిల్లలు చేసిన పనిని చాలా మంది సరదాగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ కిరాతకుడు..

పిల్లలు దేవుళ్లతో సమానం అంటుంటారు. వారిదో లోకం.. అదే అందమైన ప్రపంచం. ఏమీ తెలియని ఈ వయస్సులో చిలిపి పనులు చేస్తూ తల్లిదండ్రుల చేతితో చీవాట్లు, తన్నులు తింటూ ఉంటారు. ఇగోలు,మోసాలు చేయాలన్న మనస్థత్వాలు ఉండవు. ఈ పని చేస్తే పెద్దలు తిడతారన్న ఆలోచన శక్తి కూడా ఉండదు. ఈ అందమైన బాల్యం మకరందంలాంటిది. దీన్ని దాటుకుని వచ్చిన ప్రతి ఒక్కరూ తమ బాల్య స్మృతులను ఎప్పుడోకప్పుడూ గుర్తుకు చేసుకుంటూనే ఉంటారు. ఆ సమయంలో చేసిన సరదాలు, చిలిపి పనులను తలుచుకుని మురిసిపోతుంటారు. ప్రతి ఒక్కరు బాల్యంలో ఏదో ఒక చిలిపి పని చేసిన వాళ్లే. కొంత మంది పిల్లలు తెలిసి తెలియక చేసిన తప్పులను లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ కిరాతకుడు పిల్లలు చేసిన ఓ చిన్న తప్పుకు తల్లికి శిక్ష వేశాడు.

పిల్లలు తన తోటలోని పూలు తెంపారన్న కోపంతో తల్లి ముక్కు కోశాడో వ్యక్తి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెళగావిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుగంధ మోరే అనే అంగన్ వాడీ కార్యకర్త .. తన పిల్లలతో కలిసి బసర్త్ అనే గ్రామంలో జీవిస్తోంది. అయితే ఆ పక్కనే కల్యాణి మోరే అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి ఇంటి పెరట్లో పూల మొక్కలు పెంచాడు. అయితే ఆ పువ్వులను సుగంధ పిల్లలు అతడి పర్మిషన్ లేకుండా కోసేశారు. పిల్లలు పూలు తెంపడాన్ని చూసిన కల్యాణి.. సుగంధ ఇంటి మీదకు గొడవకు వెళ్లిపోయాడు. పిల్లలు తనను అడగకుండా పూలు కోశారని ఆమెపై గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమెపై దాడి చేశాడు.

ఈ కోపంలోనే సుగంధ ముక్కు కోశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావమైంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నిందితుడు మాత్రం ఈ ఘటన అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లల చేసి చిలిపి పనికి తల్లికి శిక్ష విధించాడీ కర్కోటకుడు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments