iDreamPost

నేను 30 ఏళ్లే బతకాలనుకున్నా.. అందుకే ఇప్పుడు చనిపోతున్నా!

నేను 30 ఏళ్లే బతకాలనుకున్నా.. అందుకే ఇప్పుడు చనిపోతున్నా!

మాములు భూమ్మీద అడుగు పెట్టిన ప్రతీ ఒక్కరు ఎక్కువ రోజులు బతకాలని అనుకుంటుంటారు. ఇక మరి కొందరైతే ఏకంగా 100 ఏళ్లు సంతోషంగా పిల్లా పాపలతో జీవించి ఆ తర్వాత చనిపోవాలని కోరుకుంటుంటారు. దీని కోసం ఆ దేవుడిని కూడా మొక్కుతుంటారు. కానీ, ఓ యువకుడు మాత్రం కేవలం 30 ఏళ్లు వరకే బతకాలని అనుకున్నాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. నిన్నటి వరకు ఎంతో ఆరోగ్యంతో ఉండి ఓ వ్యాపారాన్ని కూడా నడిపించాడు.

ఇక తాజాగా నాకు 30 ఏళ్లు వచ్చేశాయని.. అందుకే చనిపోతున్నా అంటూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో విషయం ఏంటంటే అతను చనిపోయేమందు ఓ సూసైడ్ లెటర్ కూడా రాశాడు. తాజాగా మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ ఘటనతో మృతుని కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఈ యువకుడు 30 ఏళ్లకే ఎందుకు చనిపోవాలని అనుకున్నాడు? అసలేం జరిగిందనేది తెలుసుకోవాలనుందా?

పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ ప్రాంతంలో ఆదిత్య శర్మ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఓ హోటల్ ను నడిపిస్తూ అందరితో కలిసి మెలిసి ఉండేవాడు. అయితే ఈ యువకుడు ఉన్నట్టుండి తాజాగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని అతని కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదే విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఆదిత్మ శర్మ రాసిన ఓ సూసైడ్ లెటర్ కనిపించింది. అది చదివిన పోలీసులు సైతం కంటతడి పెట్టారు.

ఇంతకు ఆదిత్య శర్మ ఆ సూసైడ్ లెటర్ లో ఏం రాశాడో తెలుసా?.. “నేను 30 ఏళ్లు మాత్రమే బతకాలని 8 ఏళ్ల కిందటే అనుకున్నాను. నాకు ఇప్పుడు 30 ఏళ్లు వచ్చేశాయి. అందుకే నా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటున్నా. నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. నా చావుకి ఎవరూ కారణం కాదు” అంటూ ఆదిత్య శర్మ చనిపోయే ముందు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయం తెలుసుకుని అతని కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. 30 ఏళ్లే బతకాలనుకుని ఆత్మహత్య చేసుకున్న ఈ యువకుడి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి