Uppula Naresh
చిరుత పులులు మరోసారి ప్రజలను భయందోళనలకు గురి చేశాయి. ఓ ప్రాంతంలోకి అర్థరాత్రి ప్రవేశించాయి. ఇంతే కాకుండా ఓ బాలుడిపై దాడి కూడా చేశాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతున్నాయి.
చిరుత పులులు మరోసారి ప్రజలను భయందోళనలకు గురి చేశాయి. ఓ ప్రాంతంలోకి అర్థరాత్రి ప్రవేశించాయి. ఇంతే కాకుండా ఓ బాలుడిపై దాడి కూడా చేశాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతున్నాయి.
Uppula Naresh
ఈ మధ్యకాలంలో వన్యప్రాణులు మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా గత కొంత కాలం నుంచి నగరంల్లోనే కాకుండా.. గ్రామాల్లో సైతం వీధి కుక్కులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. ఈ కుక్కల దాడిలో ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు చాలా మంది వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ప్రజలు రాత్రైన, పగలైన బయట అడుగు పెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ వరుస ఘటనలపై ప్రజలు స్పందిస్తూ స్థానిక లీడర్లకు అనేక రకాలుగా మోరపెట్టుకుంటున్నారు. ఈ వీధి కుక్కల దాడి నుంచి మమ్మల్ని రక్షించాలని, అంతే కాకుండా వాటిని కాలనీల్లో తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. కానీ, ఇంత వరకు నాయకులు స్పందించిన పాపన పోలేదని వారే చెబుతున్నారు.
ఇదిలా ఉంటే… తిరుమల నడకమార్గంలో ఇటీవల ఓ చిన్నారి చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకుంది. నడక మార్గంలో వెళ్లే భక్తులకు చేతి కర్రలు ఇవ్వడంతో పాటు మెట్ల మార్గంలో కంచెను సైతం ఏర్పాటుకు అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగానే మరో చోట చిరుతపుతి ఓ బాలుడిపై దాడి చేసింది. అతడిని చంపేందుకు ప్రయత్నించి కొద్ది దూరం లాక్కెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గ మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా పరిధిలోని సయాన్ గ్రామంలో ఇటీవల అర్థరాత్రి ఓ చిరుత పులి గ్రామంలోకి ప్రవేశించింది. రావడమే కాదు.. 8 ఏళ్ల బాలుడిపై దాడి చేసే ప్రయత్నం కూడా చేసింది. ఈ క్రమంలోనే అతడికి లాక్కెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇక స్థానికులు వచ్చి అరిచి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాయి. అదృష్టవశాత్తు ఇక చిరుత దాడిలో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఇదంతా గమనించిన కొందరు స్థానికులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది. అయితే ఈ వీడియోలో అక్కడ రెండు పులులు కనిపించడం విశేషం. 8 ఏళ్ల బాలుడిని లాక్కెళ్లే ప్రయత్నం చేసిన ఈ చిరుతపులి దాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) November 18, 2023