Uppula Naresh
Uppula Naresh
జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో దీప్తి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఆ యువతిని హత్య చేశారా? అసలేం జరిగిందనే వాస్తవాలు తెలియకపోవడం విశేషం. అయితే దీప్తి అనుమానాస్పత స్థితిలో మరణించినప్పటి నుంచి ఆమె చెల్లెలు అయిన చందన అదృశ్యం అవ్వడం అనేది అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బుధవారం మృతురాలి చెల్లి చందన తన తమ్ముడికి వాయిస్ రికార్డ్ పంపిన విషయం తెలిసిందే. అందులో ఆ యువతి.. “నేను అక్కను చంపలేదు సాయి. అంత అవసరం నాకేం ఉంది. నేను, అక్క ఇద్దరం కలిసి మద్యం తాగింది వాస్తవం. నేను వెళ్లిపోవాలని ముందే అనుకునే బయటకు వచ్చాను. కానీ, అక్క ఎలా చనిపోయిందో మాత్రం నాకు అస్సలు తెలియదు. నన్ను నమ్ము సాయి” అంటూ తన తమ్ముడికి పంపింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు దీప్తి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు దీప్తి ఒంటిపై గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు మాత్రం దీప్తి చెల్లెలిని అదుపులోకి తీసుకుంటే అసలు విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఆమె ఆచూకి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. మరో విషయం ఏంటంటే? దీప్తి ఒంటిపై గాయాలు ఉండడంతో ఇది ఖచ్చితంగా హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారట. దీంతో పాటు దీప్తి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం కూడా లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. ఇక దీప్తి మృతి కేసు మిస్టరీలో అసలేం జరిగిందనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. దీప్తి ఒంటిపై గాయాలు ఉండడంతో ఇది ఖచ్చితంగా హత్యేనని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.